టాలీవుడ్ యాక్టర్లు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఓ ఇంటివారు కాబోతున్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ రీల్ కపుల్ నిశ్చితార్థం గురించి తాజా అప్‌డేట్స్ బయటకొచ్చాయి. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ ఇవాళ రాత్రి నాగేంద్రబాబు నివాసంలో జరుగనుంది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబం, లావణ్య కుటుంబసభ్యులు మాత్రమే హాజరుకానున్నారట.

ఈరోజు సాయంత్రం 8 గంటలకు నాగబాబు నివాసంలో ఈ నిశ్చితార్థం జరగనుంది. తాజా సమాచారం ప్రకారం, నిశ్చితార్థానికి మెగా, అల్లు, లావణ్య కుటుంబాలు మాత్రమే హాజరు కానున్నాయని తెలుస్తోంది. ఇక ఈ ఈవెంట్‌కు అశ్విన్ మావ్లే లావణ్య స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తుండగా, అనితా డోంగ్రే లావణ్యకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించనున్నారు. వరుణ్ తేజ్ కు తరుణ్ తహిలియాని డిజైనర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ ప్రస్తుతం గాంఢీవధారి అర్జున అనే ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 25న విడుదలకానుంది. ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు వరుణ్.. పలాస ఫేమ్ కరుణ కుమార్‌తో మరో చిత్రాన్ని చేస్తున్నాడు.

ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్‌తొలిసారి శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్’ సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలో నటించారు. అప్పటి నుంచే వీళ్లిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అది ఇపుడు పెళ్లికి దారి తీసింది. ఇక పెళ్లి కూడా రాజస్థాన్‌లో ఓ బడా ప్యాలెస్‌లో చేయాలనే ఆలోచనలో ఉన్నారట. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దాదాపు అక్కడే పెళ్లి చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.