VarunLav : టాలీవుడ్ క్రేజీ హీరో వరుణ్ తేజ్ మరియు ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిన్న రాత్రి ఇటలీ లో కుటుంబ సభ్యులు మరియు బందుమిత్రుల సమక్షం లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పెళ్ళికి సంబంధించిన వీడియో కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే టాలీవుడ్ టాప్ స్టార్స్ గా కొనసాగుతున్న మెగా హీరోలందరూ ఒకే చోట ఉండడం, సరదాగా మాట్లాడుకోవడం, కలిసి డ్యాన్స్ వెయ్యడం ఇలాంటివన్నీ చూసి సంబరపడాలని అనుకుంటూ ఉంటారు. గతం లో వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక పెళ్లి వీడియో ని నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసాడు. ఈ వీడియో ఇప్పటికీ ట్రేండింగ్ లోనే ఉంది. అంత వైభోగంగా వరుణ్ తేజ్ పెళ్లి కూడా జరిగిందని అనుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పటి వరకు కేవలం ఫోటోలు వచ్చాయి కానీ, వీడియో రాలేదు.
అయితే ఈ పెళ్లి వీడియో గురించి సోషల్ మీడియా లో లేటెస్ట్ గా ఒక రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే గతం లో లాగా ఈ పెళ్లి వీడియో ని నాగ బాబు తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టాలని అనుకోవడం లేదట. ఎందుకంటే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుండి ఒక భారీ ఆఫర్ వచ్చిందట. పెళ్ళికి సంబంధించిన వీడియో షూటింగ్ మొత్తం తామే చేస్తామని, కొన్ని రోజుల తర్వాత ఆ వీడియో ని నెట్ ఫ్లిక్స్ లో అప్లోడ్ చేస్తామని, అందుకోసం 8 కోట్ల రూపాయిలు ఇస్తామని నాగబాబు కి ఆఫర్ ఇచ్చారట.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతం లో నయనతార మ్యారేజ్ ఈవెంట్ ని కూడా ఇలాగే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చెయ్యడానికి ఒప్పుకున్నారు. కానీ ఆ తర్వాత అగ్రిమెంట్ ఉల్లంఘన కారణంగా ఆ వీడియో అప్లోడ్ కాలేదు, కనీసం వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి వీడియో అయినా ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదల అవుతుందో లేదో చూడాలి.