Varun Tej : మాజీ ప్రేయసి కి పెళ్లి ఆహ్వాన పత్రిక అందచేసిన వరుణ్ తేజ్.. సినిమాల్లో కూడా ఇలాంటి రివెంజ్ ఉండదు!

- Advertisement -

Varun Tej : వచ్చే నెల 1 వ తేదీన వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్లి ఘనంగా ఇటలీ లో జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో దేశం కానీ దేశం లో పెళ్లి చేసుకోవడానికి కారణం వరుణ్ తేజ్ కి ప్రైవేట్ గా పెళ్లి చేసుకోవడం ఇష్టం కాబట్టి. హైదరాబాద్ లో చేసుకుంటే మీడియా రచ్చ వేరేలా ఉండేది.

Varun Tej
Varun Tej

ఈ వివాహ వేడుకకు మెగా కుటుంబం సభ్యులతో పాటు, లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు హాజరు కాబోతున్నారు. అలాగే ఇండస్ట్రీ నుండి కూడా కొంతమందిని వరుణ్ తేజ్ ప్రత్యేకించి ఆహ్వానించాడట. ఆయనకీ మెగా ఫ్యామిలీ కాకుండా, బయట వాళ్ళతో పెద్దగా స్నేహం లేదు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ హీరోయిన్స్ లో మాత్రం ఆయనకీ మంచి సాన్నిహిత్యం ఉండేది.

Varun Tej Lavanya

లావణ్య త్రిపాఠి తో ప్రేమ విషయం బయటపడక ముందు వరుణ్ తేజ్ మరియు రాశీ ఖన్నా ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వినిపించేవి. వీళ్లిద్దరు కలిసి గతం లో ‘తొలిప్రేమ’ అనే చిత్రం చేసారు. ఈ సినిమా షూటింగ్ సమయం లోనే వరుణ్ తేజ్ మరియు రాశీ ఖన్నా లవ్ లో పడ్డారని, ఇద్దరు కొన్నాళ్ళు డేటింగ్ కూడా చేసుకున్న తర్వాత పెళ్ళికి సెట్ అవ్వము అనే నిర్ణయానికి వచ్చి చాలా కూల్ గా బ్రేకప్ చేసుకున్నారని అప్పట్లో టాక్ ఉండేది.

- Advertisement -
Varun Tej raashi khanna

కానీ బ్రేకప్ అయ్యినప్పటికీ కూడా ఇద్దరు ఎంతో స్నేహం గా ఉన్నారు. ఇప్పటికీ ఇద్దరు బాగా మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గానే రాశీ ఖన్నా ఇంటికి వెళ్లి పెళ్ళికి కచ్చితంగా రావాలి అంటూ ఆహ్వాన పత్రిక అందచేసాడట వరుణ్ తేజ్. ప్రస్తుతం ఇది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here