సినిమాల్లోకి రాకముందు నాకు క్రమ శిక్షణ లేదు..: వరుణ్ తేజ్

- Advertisement -

వరుణ్ తేజ్ హీరోగా ‘గాండీవధారి అర్జున’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బీవీఎస్ ఎన్ ప్రసాద్ – బాపినీడు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకి పీ.ఎస్వీ. గరుడవేగా ఫేమ్ ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఘోస్ట్ తర్వాత ప్రవీణ్ తెరకెక్కిస్తున్న మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. వరుణ్ తేజ్ ఈ చిత్రంలో ‘అర్జున్ వర్మ’ అనే పాత్రలో కనిపించబోతున్నాడు.ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల వేడుకను గురువారం నిర్వహించింది.

వరుణ్ తేజ్
వరుణ్ తేజ్

ట్రైలర్‌ లాంచ్‌ అనంతరం మీడియాతో ముచ్చటించింది. హీరో, హీరోయిన్‌, దర్శకుడు, నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, నటుడు నరేన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమాసినిమాకు ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకుంటా. ప్రవీణ్‌ కథ చెప్పిన వెంటనే నటించేందుకు అంగీకరించా. అంత బాగా నచ్చింది. సామాజిక అంశంతో ముడిపడి ఉన్న ఈ సినిమాలో నటించడం నా బాధ్యత అనుకున్నా. ఈ చిత్రంలో యాక్షన్‌ మాత్రమే కాదు ఇతర అంశాలూ ఉన్నాయి. ఈ సినిమా చూశాక ‘మన చుట్టూ ఇంత జరుగుతోందా!’ అని అందరూ ఆశ్చర్యపోతారు’’ అని వరుణ్‌తేజ్‌ పేర్కొన్నారు.

‘‘విదేశాల్లో షూటింగ్‌లో పాల్గొనడం నాకు కొత్తేమీ కాదు. నా గత చిత్రం ‘తొలిప్రేమ’ చిత్రీకరణ ఎక్కువగా విదేశాల్లోనే జరిగింది. అయితే, అది లవ్‌స్టోరీ. ఇది యాక్షన్‌ ఫిల్మ్‌. నేను సూట్‌ ధరించి కనిపించడంతో అంతా దీన్ని ‘స్పై’ చిత్రం అనుకుంటున్నారు. కానీ, కాదు. నేనిందులో బాడీగార్డ్‌గా కనిపిస్తా. కథ డిమాండ్‌ మేరకే ఇండియా దాటి అక్కడకు వెళ్లి షూటింగ్‌ చేస్తుంటాం తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఇప్పటి వరకు నేను ఇలాంటి కథ, పాత్రలో నటించలేదు. ఏ సినిమా అయినా హిట్‌కావాలనుకునే అనుకుంటాం. మనసుకు నచ్చిన కథలు ఎంపిక చేసుకుని, నటించుకుంటూ వెళ్తుంటాగాని ఎలాంటి లెక్కలేసుకోను. సినిమాల్లోకి రాకముందు నాకు క్రమశిక్షణ లేదు. సినిమానే నన్ను సరైన దారిలోకి తీసుకొచ్చింది’’ అని అన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here