మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా వరుణ్ తేజ్ పెళ్లికి రంగం సిద్ధం.. తన రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ఏడడుగులు వేయనున్నారట. నిశ్చితార్థ వేడుకకు ముహూర్తం ఫిక్స్ చేశారట..హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి డేటింగ్ చేస్తున్నారనే వార్తలు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే..మొత్తానికి ముహూర్తం ఫిక్స్ చేశారు..
ఈ విషయాన్ని మెగా ఫ్యామిలి అధికారికంగా ప్రకటించలేదు కానీ ఓ బాలివుడ్ మీడియా మాత్రం ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.జూన్ 9న లావణ్యతో వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరగనుందట. ఇందుకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట. వధూవరుల దుస్తులు, ఆభరణాలు ప్రముఖ డిజైనర్స్ రూపొందిస్తున్నారట..ఈ నిశ్చితార్థం వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరుకానున్నారట.. అయితే ఈ నిశ్చతార్థం కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య మాత్రమే జరగనుందని సమాచారం..
లావణ్య-వరుణ్ జంటగా మిస్టర్ మూవీ చేశారు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీ అంచనాలు అందుకోలేదు. అయితే వీరి పరిచయం ప్రేమకు దారి తీసిందట. ఏడాది కాలంగా వరుణ్, లావణ్య వివాహ వార్త హాట్ టాపిక్ గా ఉంది.. కొన్నిసార్లు లావణ్య ఈ వార్తల పై స్పందించింది.. అలాంటివి ఏమిటి లేదని చెప్పింది.. ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ లేదు. ఇటీవల లావణ్య పులి మేక టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేశారు. ఇది కూడా సక్సెస్ కాలేదు.ఇక వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న గాండీవధారి అర్జున చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.దీంతో పాటు మరో సినిమాను కూడా చేస్తున్నారని టాక్..