వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి గురించి ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుండి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వరుణ్ తేజ్ గురించి మరో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది.అయితే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కంటే ముందే మరొక హీరోయిన్ తో వన్ సైడ్ లవ్ లో పడ్డారట.. ఆ హీరోయిన్ ను ఎలాగైనా ఒప్పించి మెగా కోడలిని చేద్దామని అనుకున్నాడట..ఆ హీరోయిన్ బాగా బిజీ అవ్వడంతో లావణ్య ను ప్రేమించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలో స్టార్స్ గా రాణిస్తున్నారు. అందులో చిరంజీవి, పవన్ కళ్యాణ్,రామ్ చరణ్ స్టార్ హీరోలుగా కొనసాగుతుంటే వరుణ్ తేజ్,సాయి ధరంతేజ్, వైష్ణవ్ తేజ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా జరిగింది.. ఆ కార్యక్రమానికి కేవలం ఫ్యామిలి మెంబెర్స్, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.. అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..
కాగా,గతంలో లావణ్య కంటే ముందే వరుణ్ తేజ్ మరో హీరోయిన్ తో ప్రేమలో పడ్డారట. ఇక హీరోయిన్ ఎవరో కాదు వరుణ్ మొదటి సినిమా హీరోయిన్ పూజ హెగ్డే. పూజ హెగ్డే తో కలిసి వరుణ్ తేజ్ ముకుంద సినిమాలో నటించారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్న టైం లోనే వరుణ్ తేజ్ కి ఆ ఒక్క విషయంలో పూజ హెగ్డే చాలా నచ్చిందట..పూజ హెగ్డే హైట్ కి వరుణ్ తేజ్ ఫిదా అయ్యి చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడట. కానీ ఆ తర్వాత ఎందుకో పూజ హెగ్డే తనకు సెట్ అవ్వదు అనిపించి తన ప్రేమ విషయాన్ని పూజ హెగ్డే కి చెప్పలేదట… ఆ తర్వాత లావణ్యను ప్రేమించాడు… ఇంకొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు..