తొలిప్రేమ సినిమాకి పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో తొలిప్రేమ ఎవర్ గ్రీన్ క్లాసికల్ హిట్ గా నిలిచిపోతుంది. కెరీర్ స్టార్టింగ్ లోనే బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు పవన్ కళ్యాణ్. తొలిప్రేమ సినిమాలో లవ్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీ, రొమాన్స్, ఇలా అన్ని యాంగిల్స్ ను రంగరించి ప్రేక్షకులకు అందించారు చిత్ర యూనిట్. 1998 జులై 24న ఈ సినిమా విడుదలై.. ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కు జోడీగా కీర్తి రెడ్డి నటించింది. 2023, జులై 24కు ఈ సినిమా రిలీజ్ అయ్యి సరిగ్గా 25 ఏళ్ళు అవుతుంది. అప్పట్లోనే ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా డబుల్ అయ్యింది..

తొలిప్రేమ
తొలిప్రేమ

పవన్ కెరీర్లో తొలిప్రేమ సక్సెస్ కాకపోయి ఉంటే ఆయనకు ఈ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడి ఉండేది కాదేమో.. కారణం ఈ సినిమా తర్వాతనే ఈయన స్టార్ హీరోగా నిరూపించుకున్నాడు. ఈ సినిమా 25 ఏళ్ళు అయిన సందర్భంగా మేకర్స్ జూన్ 30న ఈ సినిమా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ అంత అంతటి బ్లాక్ బస్టర్ సినిమాకు పవన్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారో అని ఆలోచిస్తున్నారు. ఈ సినిమాకు రెమ్యునరేషన్ గా నెలకు ఇంత అని ఇవ్వమన్నాడని నిర్మాత చెప్పాడు. అయితే ఆ డబ్బులతో పవన్ పుస్తకాలూ, మొబైల్ ఫోన్ కొనుకున్నట్లు చెప్పుకొచ్చాడు.. ఇక ఈ మూవీ షూటింగ్ లో నిజమైన ప్రేమికులుగా కూడా మారారని.. పవన్ చెల్లెలి రోల్ లో నటించిన వాసుకి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారని జివిజి రాజు చెప్పుకొచ్చాడు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here