Varalaxmi Sharathkumar : వారసత్వంగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. తమిళ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే తనకు ఎలాంటి పాత్రలు సెట్ అవుతాయో తెలుసుకుని.. వాటికే సై అన్నారు. వరలక్ష్మి తీసుకున్న నిర్ణయం ఆమె కెరీర్‌ని ఎక్కడికో తీసుకెళ్లింది. హీరోయిన్లను మించి.. వరుస సినిమాల్లో.. బలమైన పాత్రలు చేస్తూ.. సౌత్ లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె హనుమాన్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించింది. పాత్ర నచ్చాలే కానీ విలన్, సపోర్టింగ్ యాక్టర్ ఇలా వేటి గురించి ఆలోచించదు. అదే ఆమె కెరీర్‌కు ప్లస్సయింది. ఇప్పుడున్న ఇండస్ట్రీలో కుర్ర లేడీ విలన్‌గా, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్.
పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే వరలక్ష్మి శరత్ కుమార్ చాలా ఫ్రాంక్ గా ఉంటారు. వివాదాలకు, గాసిప్‌లకు దూరంగా ఉన్నారు. ఇన్నాళ్లు పెళ్లి గురించి ఆలోచించలేదు. కాకపోతే.. అప్పట్లో వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రేమకథ, పెళ్లిపై ఎన్నో పుకార్లు వచ్చాయి. హీరో విశాల్‌తో ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. కానీ శరత్ కుమార్ వీరి ప్రేమను అంగీకరించలేదు.. అందుకే పెళ్లి ఆగిపోయింది. అయితే వాటిని వరలక్ష్మి ఖండించింది. తాము మంచి స్నేహితులమని స్వయంగా స్పష్టం చేసింది. రీసెంట్ గా ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో నిశ్చితార్ధం చేసుకుంది. త్వరలోనే ఏడు అడుగులతో ఒక్కటి కాబోతున్న ఈ జంట పెళ్లికి ముందే హనీమూన్ ని ఎంజాయ్ చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు . రీసెంట్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ తన బాయ్ ఫ్రెండ్ నికోలైయ్ సచ్ దేవ్ తో రొమాంటిక్ డిన్నర్ డేట్ ను ప్లాన్ చేసుకుంది.
థాయిలాండ్ లో వీళ్లు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తిరుగుతున్న పిక్చర్స్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆమె షేర్ చేసుకుంది. ఈ పిక్చర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కొందరు పెళ్ళికి ముందే హనీమూన్ కంప్లీట్ చేసుకుంటున్నారా..? అంటూ చీప్ గా వల్గర్ గా కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు మీ జంట చూడముచ్చటగా ఉంది అంటూ విషెస్ అందిస్తున్నారు. ప్రజెంట్ వరలక్ష్మి శరత్ కుమార్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.