Pawan Kalyan ఒకపక్క సినిమాలు చేస్తూ మరో పక్క రాజకీయాలు నడుపుతూ ఊపిరి కూడా తీసుకోలేనంత బిజీ గా గడుపుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇంత బిజీ లో కూడా ఆయన అత్యంత వేగంగా సినిమాలను పూర్తి చేసేస్తున్నాడు. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం మరో 8 రోజుల్లో మన ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ని విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి క్లీన్ U సర్టిఫికెట్ ని జారీ చేసింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని కేవలం 41 రోజుల్లో షూటింగ్ ని పూర్తి చేశారట. ఒక స్టార్ హీరో సినిమా ఇంత వేగవంతంగా షూటింగ్ ని పూర్తి చేసుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు.

గతం లో ఇంత వేగంగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న చిత్రం కూడా పవన్ కళ్యాణ్ సినిమానే అవ్వడం విశేషం. రీ ఎంట్రీ తర్వాత ఆయన చేసిన ‘వకీల్ సాబ్’ అనే చిత్రాన్ని పవన్ కళ్యాణ్ కేవలం 45 రోజుల్లో పూర్తి చేసాడు. దాని ఔట్పుట్ ఎంత అద్భుతంగా వచ్చిందో మన అందరికీ తెలిసిందే. సినిమాలో పవన్ కళ్యాణ్ పేజీల పేజీల డైలాగ్స్ ని కేవలం సింగల్ టేక్ లోనే చెప్పేవాడట.

అందుకే అంత ఫాస్ట్ గా ఆ చిత్రం పూర్తి అయ్యిందని అంటున్నారు. ‘బ్రో ది అవతార్’ సినిమా విషయం లో కూడా అదే జరిగింది. ప్రతీ సన్నివేశాన్ని సింగిల్ టేక్ లోనే చేసేవాడట. ఫలితంగా అద్భుతమైన ఔట్పుట్ వచ్చింది అని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ తో నింపేసాడట డైరెక్టర్ సముద్ర ఖని. అందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి మరి