Vaishnavi Chaitanya .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఈ క్యూట్ గర్ల్ ‘బేబీ’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్న చైతన్య.. దర్శకుడు రాజేష్ తెరకెక్కించిన ‘బేబీ’తో హీరోయిన్ గా యూత్ ను బాగా ఎట్రాక్ట్ చేసింది. తన అందం, అభినయంతో తానేంటో ఒక్క సినిమాతోనే పూర్తిగా నిరూపించుకుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ భామ ఇప్పుడు చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సిద్దు జొన్నలగడ్డ సినిమాతో పాటు ఆశిష్ రెడ్డి సినిమాలోనూ నటిస్తోంది. వైష్ణవి చైతన్య తన తొలి సినిమా హీరో అయిన ఆనంద్ దేవరకొండతో మరో చిత్రంలో నటించబోతోంది.

అయితే ఏ హీరోయిన్ అయినా కెరీర్‌లో స్టార్‌డమ్ వచ్చినప్పుడు.. మళ్లీ సైడ్ రోల్స్‌లోకి వెళితే కెరీర్‌కి ఎలాంటి దెబ్బ తగులుతుందో వాళ్లకు తెలుసు. అలా నటించిన చాలా మంది స్టార్ హీరోయిన్లు ఇప్పుడు అవకాశాలు రాకపోవడంతో ఖాళీగా ఉన్నారు.. అందులో కీర్తి సురేష్ ఒకరు. అయితే ఇప్పుడు వైష్ణవి కూడా అలాంటి తప్పుడు పని చేస్తుంది.

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ చెల్లెలి పాత్ర కోసం చాలా మంది హీరోయిన్లను పరిశీలిస్తున్నారు. చివరకు వైష్ణవి చైతన్య అయితే బాగుంటుందని దర్శకుడు డిసైడ్ అయ్యాడట. మరి ఇలాంటి సినిమా కోసం హీరోయిన్ కాస్త చెల్లి అయిపోతే .. ఆ తర్వాత మళ్లీ హీరోయిన్ పాత్రలు రావడం ఎంత వరకు సాధ్యం. అంటే ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమా అంటే ప్రభాస్ పక్కన చేసే పాత్రను ఎవరు వదులుకుంటారు. దాని వల్ల మీ కెరీర్‌ని రిస్క్‌లో పడేయలేదా? అంటూ ఆమె సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్‌డేట్‌లు రావాల్సి ఉంది.