Vaarasudu : 2023 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి తమిళ స్టార్ హీరో విజయ్ కూడా వచ్చేశాడు. ఆయన కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘వారసుడు’. ఎప్పుడు డబ్బింగ్ సినిమాలతోనే టాలీవుడ్ ప్రేక్షకులన పలకరించే విజయ్.. తొలిసారి స్ట్రెయిట్ తెలుగు సినిమాతో వచ్చారు. ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది.
ఇప్పటికే ఈ సినిమాను మూవీ మ్యూజిక్ డైరెక్టర్.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్‌రాజులతో కలిసి చూశారు. సినిమాలో విజయ్ యాక్టింగ్ చూసి ఎమోషనల్ అయ్యారు తమన్. థియేటర్లోనే వెక్కివెక్కి ఏడ్చారు.
మరోవైపు ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ‘‘సోదరుల మధ్య చోటుచేసుకునే ఎమోషన్స్ ఇందులో కనిపిస్తాయి. చిత్రం ప్రారంభం నుంచి చివరి వరకూ నా క్యారెక్టర్ కొనసాగుతూనే ఉంటుంది. విజయ్‌లాంటి స్టార్ హీరోకు సోదరుడిగా నటించడం, ఈ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండడం చాలా సంతోషంగా ఉంది. విజయ్ ఫ్యామిలీ చిత్రాల్లో నటించి చాలా కాలమైంది. ఆ లోటును ఈ సినిమా తీరుస్తుంది. ఇది పండగకు పండగలాంటి చిత్రం’’ అని శ్రీకాంత్ చెప్పారు.
ఇంకోవైపు ఈ సినిమాను తన తండ్రితో పాటు కలిసి చూశారు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. తన జీవితంలో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నానంటున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. కుటుంబంతో కలిసి ‘వారసుడు’ వీక్షించిన ఆయన ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఈ సినిమా చూసి వంశీ తండ్రి భావోద్వేగానికి గురి కావడం.. పుత్రోత్సాహంతో ఆయన్ని హత్తుకోవడం వంటి భావోద్వేగ దృశ్యాలతో ఈ వీడియో సాగింది.
‘‘వారసుడు’ వీక్షించి నా తండ్రి ఎంతగానో ఆనందించారు. ఈరోజు నేను నా జీవితంలో అతిపెద్ద విజయాన్ని అందుకున్నాను. జీవితాంతం ఈ క్షణాలను గుర్తుపెట్టుకుంటాను. ‘నాన్నా.. నువ్వే నా హీరో. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’’ అంటూ వంశీ రాసుకొచ్చారు.
‘మహర్షి’ వంటి క్లాస్ విజయం తర్వాత వంశీ తెరకెక్కించిన పూర్తిస్థాయి తమిళ చిత్రం ‘వారిసు’ . విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రానికి కమర్షియల్ హంగులు జోడించి దీన్ని రూపొందించారు. రష్మిక, జయసుధ, ఖుష్బూ, శరత్‌కుమార్, శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రలు పోషించారు. కోలీవుడ్‌లో జనవరి 11న విడుదలైన ఈ చిత్రం ఆ రాష్ట్రంలో మంచి టాక్ అందుకుంది. ఇక, శనివారం ‘వారసుడు’ పేరుతో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలైంది.