‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి గ్లిమ్స్ కాసేపటి క్రితమే విడుదలైంది. ఈ టీజర్ ని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 MM థియేటర్ లో అభిమానుల సమక్షం లో విడుదల చేసారు.రెస్పాన్స్ మామూలు రేంజ్ లో లేదు.ఒక కొత్త సినిమా విడుదలైతే ఎలాంటి జనం వస్తారో, అంతటి జనం ఈ 45 సెకండ్స్ గ్లిమ్స్ ని చూడడానికి వచ్చారు.
ఇక ఆన్లైన్ లో విడుదల చేసిన తర్వాత ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఊర మాస్ లుక్స్ మరియు డైలాగ్ డెలివరీ చూసి అనందం తో కంటతడి పెట్టుకున్నారు. 15 రోజుల్లో హరీష్ శంకర్ ఇంత అద్భుతమైన ఔట్పుట్ ఎలా తీసాడు అనే ఆశ్చర్యం లో ఉన్నారు ఫ్యాన్స్ మరియు ఆడియన్స్.
ఈ గ్లిమ్స్ వీడియో భగవద్గీత లోని ధర్మం ,అధర్మం కాన్సెప్ట్ తో ప్రారంభం అవుతుంది. టీజర్ ప్రారంభం లోనే పవన్ కళ్యాణ్ జీప్ లో నుండి స్టైల్ లుంగీ కట్టుకొని దూకడం హైలైట్ గా నిల్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల పై ఫైర్ అవ్వడం,పుస్తకాన్ని విసిరిగొట్టడం వంటి వాటిల్లో ఆయన అగ్రేషన్ ని బాగా కవర్ చేసాడు డైరెక్టర్ హరీష్ శంకర్.
ఇక గ్లిమ్స్ చివర్లో ‘ఈసారి పెర్ఫార్మన్స్ బద్దలైపోతాది’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ కి అదిరిపొయ్యే రెస్పాన్స్ వచ్చింది ఫ్యాన్స్ నుండి. లాస్ట్ లో గన్ కాలుస్తూ ‘హాట్ సాలే’ అంటూ పవన్ కళ్యాణ్ మరోసారి బోల్డ్ డైలాగ్ చెప్పాడు. కేవలం 45 సెకండ్స్ గ్లిమ్స్ వీడియో లో ఇన్ని చూపిస్తే ఇక సినిమా లో ఫ్యాన్ మూమెంట్స్ ఎన్ని ఉంటాయో అని ఫ్యాన్స్ ఇప్పటి నుండే అంచనాలు వేసుకుంటున్నారు.