Urvashi Rautela : బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య చిత్రంలో వేర్ ఈజ్ ది పార్టీ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులు వేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పారిస్‌లో ఇటీవల వన్డే ప్రపంచకప్ 2023 ట్రోఫీని ఆవిష్కరించి ఇలాంటి అరుదైన అవకాశం దక్కించుకున్న ఏకైక నటిగా నిలిచింది.

ఇక అమ్మడు సోషల్ మీడియా పోస్టులతో, స్టేట్‌మెంట్స్‌తో తరచుగా వార్తల్లోనే ఉంటుంది. తాజాగా ఆమె తన పారితోషికం విషయంలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ భామ ఒక్క నిమిషానికి కోటి రూపాయల రెమ్యునరేషన్ వసూలు చేస్తోందంటూ గత కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన ఊర్వశికి ఓ విలేకరి ఇదే ప్రశ్న అడిగాడు.

నిమిషానికి మీరు కోటి తీసుకుంటూ భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణిగా ఉన్నారా..? దీనిపై మీరేమంటారు అని ప్రశ్నించారు..? దీనికి ఇలా బదులు ఇచ్చింది. ఇది మంచి విషయం. స్వతహాగా ఈ రంగంలో పైకి ఎదిగిన ప్రతి ఒక్కరూ ఇలాంటి విజయాలు సాధించాలని కోరుకుంటున్నా అని అంది. ఊర్వశి రౌతేలా సమాధానం చెప్పిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఆమెను నెటీజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఏం చేస్తావని అంత తీసుకుంటున్నావని కామెంట్స్ చేస్తున్నారు.