Urvashi Rautela : బాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకడిగా, అతిలోక సుందరి శ్రీదేవి భర్త గా బోనీ కపూర్ కి ఎంత మంచి పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ కూతురు జాన్వీ కపూర్ కూడా సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకుంది. శ్రీదేవి ని ప్రేమించి, మొదటి భార్య తో కలిసి ఉండగానే పెళ్లి చేసుకున్న బోనీ కపూర్ అప్పట్లో చాలా విమర్శలే ఎదురుకున్నాడు. శ్రీదేవి సంపాదించిన ఆస్తులు మొత్తం కూడా బోనీ కపూర్ పేరు మీదనే ఉన్నాయి.
5 ఏళ్ళ క్రితం ఒక వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా వెళ్ళింది శ్రీదేవి. ఆ మరుసటి రోజు ఫైవ్ స్టార్ హోటల్ బాత్రూం లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది శ్రీదేవి. ఆమె మరణం పై అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. బోనీ కపూర్ యే ఆమెని చంపించాడని ఒక రూమర్ ఉంది, అందులో ఎంత మాత్రం నిజం ఉందో ఎవరికీ తెలియదు.
బోణీ కపూర్ వయస్సు ఇప్పుడు 67 ఏళ్ళు. కూతుర్లు ఇద్దరూ కూడా పెళ్ళికి ఎదిగి ఉన్నారు. అలాంటి వయస్సులో ఆయన కూతురు వయస్సున్న అమ్మాయిని పెళ్లాడడానికి సిద్ధం అయిపోయాడు. ఐటెం సాంగ్స్ తో ప్రస్తుతం సినిమాల్లో ఫుల్ బిజీ గా ఉంటున్న ఊర్వశి రౌతేలా తో బోణీ కపూర్ డేటింగ్ చేస్తున్నాడని బాలీవుడ్ మొత్తం జోరుగా వినిపిస్తున్న రూమర్. ఊర్వశి రౌతేలా ఇష్టం తోనే ఈ డేటింగ్ జరుగుతుందట. త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారట.
ఊర్వశి రౌతేలా సై అంటే ఆమె అందానికి ప్రపంచం లో ఉన్న అందమైన అబ్బాయిలందరు ఆమెని పెళ్లాడడానికి క్యూ లైన్ లో నిల్చుంటారు. అలాంటిది ఆమె తన తండ్రి వయస్సున్న వ్యక్తిని పెళ్లాడడానికి ఎలా సిద్ధమైంది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెదవి విరుస్తున్నారు. తన కెరీర్ పీక్ రేంజ్ కి వెళ్లాలనే ఉద్దేశ్యం తోనే ఊర్వశి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.