Upasana Konidela : మెగా ఫ్యామిలీ లో ఉండేవాళ్ళకు బయట హీరోలను ఇష్టపడాల్సిన అవసరం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ కుటుంబం లోనే నలుగురు స్టార్ హీరోలు ఉన్నారు. పాన్ ఇండియా ని దాటి పాన్ వరల్డ్ రేంజ్ కి ఎదిగారు. బోలెడంత టాలెంట్ మొత్తం మెగా ఫ్యామిలీ లోనే ఉంది. ఇక పక్క హీరోలను చూసే పరిస్థితి ఎలా వస్తుంది?. కానీ మెగా ఫ్యామిలీ ఉన్న వాళ్లకి బయట హీరోలలో బాగా నచ్చే హీరో విక్టరీ వెంకటేష్ అట. రామ్ చరణ్ కూడా ఒక ఇంటర్వ్యూ లో విషయం చెప్తాడు.

తనతో పాటుగా ఇంట్లో వాళ్ళందరూ వెంకటేష్ సినిమాలను చూసేందుకు అమితాసక్తిని చూపిస్తారు. ఇక రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. అపోలో హాస్పిటల్స్ కి చైర్మన్ గా పనిచేసే ఈమెకి సినిమాలు చూసేంత సమయం అసలు ఉండదు. కానీ చదువుకునే రోజుల్లో సినిమాలు బాగా చూసేది అట.

బాలీవుడ్ లో ఆమె సల్మాన్ ఖాన్ కి వీరాభిమాని అట. ఆయన సినిమా అప్పట్లో విడుదల అయితే మొదటి రోజు మొదటి ఆట ఇండియా లో చూడాల్సిందేనట. ఈ సందర్భంగా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సల్మాన్ ఖాన్ వాంటెడ్ చిత్రం విడుదల సమయం లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చింది ఉపాసన. ఆమెకి మామూలుగా సల్మాన్ ఖాన్ సినిమాలు ఇండియా లో ఊర మాస్ థియేటర్ లో చూడడం ఇష్టమట.

అభిమానుల అరుపులు, గోలలు మధ్య సినిమా చూస్తే ఆ కిక్ వేరు అని సల్మాన్ ఖాన్ ప్రతీ సినిమాని విడుదల రోజు మొదటి ఆట ఎలాంటి పరిస్థితి లో ఉన్నా చూసేది అట. సల్మాన్ ఖాన్ ‘వాంటెడ్’ చిత్రం విడుదల సమయం లో ఉపాసన అమెరికా లో ఉండేది. కేవలం ఈ సినిమా మాస్ ఆడియన్స్ మధ్య చూసేందుకు అమెరికా నుండి లక్ష రూపాయిల ఫ్లైట్ టికెట్ కొని వచ్చి చూసి వెళ్లిందట. దీనిని బట్టీ ఆమె ఎంత పెద్ద ఫ్యాన్ అనేది అర్థం చేసుకోవచ్చు.