Pawan Kalyan : సుమారుగా పెళ్ళైన 11 ఏళ్ళ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన కి క్లిన్ కారా అనే పాప పుట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాప పుట్టడం తో మెగా కుటుంబం ఎంత సంతోషంగా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ – ఉపాసన క్లిన్ కారా ని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ పాప ముఖాన్ని చూపించలేదు కానీ, అనేక సందర్భాల్లో ముఖాన్ని కవర్ చేస్తూ సోషల్ మీడియా లో చాలా ఫొటోలే అప్లోడ్ చేసారు.

ఫ్యాన్స్ కి పాప రామ్ చరణ్ పోలికలతో ఉందా, లేకపోతే ఉపాసన పోలికలతో ఉందా అనేది తెలుసుకునేందుకు చాలా కోరికగా ఉంది. అదంతా పక్కన పెడితే క్లిన్ కారా ని ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చూడలేకపోయాడు అంటూ సోషల్ మీడియా లో ఒక రూమర్ ప్రచారమైన సంగతి అందరికి తెలిసిందే.

అయితే దీనిపై ఉపాసన రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో క్లారిటీ వచ్చింది. పాప పుట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ టూర్ లో ఉన్నాడని, టూర్ నుండి తిరిగి రాగానే ఆయన ముందు తన ఇంటికి వెళ్లకుండా మా ఇంటికి వచ్చి పాప ని చూసి వెళ్లాడని, కానీ సోషల్ మీడియా లో జరిగిన ఆ ప్రచారం చూసి చాలా బాధ వేసింది అంటూ చెప్పుకొచ్చింది అట.

ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ పిల్లలు రేణు దేశాయ్ మరియు ఆద్య మాత్రం ఇప్పటి వరకు డైరెక్ట్ గా క్లిన్ కారా ని చూడలేదట. ఎందుకంటే వాళ్ళు కలిసి దాదాపుగా ఏడాది అయిపోయిందట. వరుణ్ తేజ్ పెళ్ళికి కూడా ఈ ఇద్దరు రాలేదు. అకిరా నందన్ కొంతకాలం నుండి అమెరికాలో ఫిలిం ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.