Upasana Konidela : మెగా కాంపౌండ్ లో ఉపాసన బేబీ షవర్.. ఫొటోలు వైరల్

- Advertisement -

Upasana Konidela : టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ఫుల్ ఖుషీగా ఉంది. ఎందుకంటే ఈ కుటుంబానికి త్వరలో ఓ వారసుడు రాబోతున్నాడు. అదేనండి మెగాస్టార్ వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలకు త్వరలో పండంటి బిడ్డ పుట్టబోతోంది. ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి ఈ ఫ్యామిలీతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెగా అభిమానుల సంబురం అంబరాన్నంటుతోంది. మరోవైపు ఉపాసన, చెర్రీలకు సెలబ్రిటీలకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు. 

Upasana konidela
Upasana konidela

ప్రస్తుతం ఉపాసన, చెర్రీలు తమ కపుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలో తమ ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవుతున్న ఆనందంలో ఉన్న ఈ జంటకు జులైలో బిడ్డ పుట్టనుంది. అయితే ఇటీవలే స్నేహితుల సమక్షంలో ఉపాసన దుబాయ్‌లో బేబీ షవర్‌ వేడుక చేసుకున్న సంగతి తెలిసిందే.  అలాగే చిరంజీవి నివాసంలోనూ ఆమె ఈ వేడుకను చేసుకున్నారు. హైదరాబాద్‌లో మరోసారి ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ కలిసి ఉపాసనకు బేబీ షవర్‌ ఫంక్షన్‌ చేశారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఫొటోలను ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. మా బేబీకి మీ ఆశీస్సులు అందాయి. చాలా ఆనందంగా ఉంది. ఇది లైఫ్ లో గొప్ప అనుభూతి అంటూ క్యాప్షన్ జోడించింది. ఈ ఫంక్షన్‌కు అల్లు అర్జున్‌ కూడా హాజరయ్యారు. ఉపాసనతో దిగిన ఫొటోలను బన్నీ తన ఇన్‌ స్టాలో షేర్‌ చేశారు.

- Advertisement -
upasana allu arjun
Upasana

ఎంతో ఆనందంగా ఉందంటూ ఆమెకు బన్నీ శుభాకాంక్షలు చెప్పారు. ‘‘సో హ్యాపీ ఫర్‌ మై స్వీటెస్ట్‌ ఉప్సీ’’ అని క్యాప్షన్‌ రాశారు. అలాగే ఎంతో సరదాగా జరిగిన ఈ వేడుకలో సానియా మీర్జా, సుస్మితతో పాటు ఉపాసన, రామ్‌ చరణ్‌  ఫ్రెండ్స్‌ కూడా సందడి చేశారు. ఇక ఈ ఫొటోస్‌ చూసిన అల్లు – మెగా ఫ్యామిలీల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారి అభిమానాన్ని కామెంట్స్‌ రూపంలో తెలుపుతున్నారు.

upasana ram charan
Upasana

ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉపాసన తన ఆహార అలవాట్లు, డ్రెస్సింగ్‌ గురించి తెలిపారు. ‘‘నేను నా బిడ్డ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. కావలసిన పోషకాహారాన్ని తీసుకుంటున్నాను. మెటర్నటీ దుస్తులు ధరించడం లేదు. నాకు సౌకర్యవంతంగా ఉండే వాటిని వేసుకుంటున్నా. ఇలా కనిపించడాన్ని చాలా గొప్పగా భావిస్తున్నా. ప్రెగ్నెన్సీ అనేది ఓ వేడుకలా ఉండాలి. ఇదొక గొప్ప ప్రయాణం దీన్ని నేను అస్వాదిస్తున్నా’’ అని ఉపాసన తెలిపారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here