సొంత హాస్పటల్ అయినా ఉపాసన డెలివరీ ఖర్చు అన్ని కోట్లైందా..!

- Advertisement -

మెగా కోడలు, రామ్ చ‌ర‌ణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల ఇటీవ‌ల పండంటి ఆడ‌బిడ్డ‌కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తో పెళ్లి అయిన‌ పదేళ్ల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ అయింది. జూన్ 20వ తేదీన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో ఉపాసన డెలివరీ జరిగింది. మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మెగా అభిమానులు సైతం సంబరాలు చేసుకున్నారు.

ఉపాసన
ఉపాస‌న

జూన్ 22వ తేదీన ఉపాస‌న హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ బేబీతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉపాసన డెలివరీ ఖర్చు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉపాసన డెలివ‌రీ తన సొంత హాస్పిటల్ లోనే అయినప్పటికీ.. ఆమె డెలివరీ కోసం భారీ స్థాయిలోనే ఖర్చు చేశార‌ట‌. ఉపాస‌న డెలివరీ కోసం ఒక ఫ్లోర్ మొత్తాన్ని ఖాళీ చేయించారు. అలాగే ప్రపంచం లోనే అత్యుత్తమ గైనకాలజిస్ట్స్ ని ఉపాసన డెలివరీకి ర‌ప్పించారు.

ఫారిన్ నుంచి కొందరు డాక్టర్లు రావ‌డం మ‌రియు విదేశాల నుంచే కొన్ని ఎక్విప్మెంట్స్ ను తిప్పించ‌డం వ‌ల్ల బిల్ గ‌ట్టిగా అయింద‌ట‌. దాదాపు కోటిన్నర రూపాయల వరకు ఉపాస‌న డెలివ‌రీ ఖ‌ర్చు అయింద‌ని.. ఆ మొత్తాన్ని రామ్ చ‌ర‌ణే పే చేశాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు క‌ళ్లు తేలేస్తున్నారు. ఉపాస‌న డెలివ‌రీ ఖ‌ర్చుతో ఓ భారీ బంగ్లానే కొనేయొచ్చు అంటూ అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక ఈ ఖర్చులన్నింటిని రామ్ చరణ్ భరించినట్టు సమాచారం.అయితే ఉపాసన డెలివరీ ఖర్చు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ కోటిన్నర ఖర్చుతో ఓ కుటుంబం లైఫ్ లాంగ్ బ్రతుకుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here