JR NTR : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఊర నాటు మాస్ హీరోలు ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. నందమూరి తారకరామారావు గారి మనవడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, రెండేళ్లకే ఎవరికీ సాధ్యం కానీ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించాడు. ఆయనకీ ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు స్టార్ స్టేటస్ వచ్చినప్పుడు అతని వయస్సు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే.

సింహాద్రి సినిమా సమయానికి ఆయన ఫ్యాన్ బేస్ విషయం లో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి కి పోటీ ఇచ్చే రేంజ్ కి ఎదిగాడు. ఆ తర్వాత వరుసగా కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి కానీ, మళ్ళీ యమదొంగ లాంటి చిత్రం తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అలా ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్ గురించి చెప్పుకుంటూ పోతే ఈ ఒక్క రోజు సరిపోదు కానీ, ఆ కెరీర్ లో కొన్ని సినిమాలు పూజా కార్యక్రమాలను జరుపుకొని కూడా ఆగిపోయినవి చాలా ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

‘అరవింద సమేత’ అవంతి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఒక సినిమాని చెయ్యాలనుకున్నాడు. ఆ చిత్రం ప్రారంభోత్సవం కూడా జరిగింది, కానీ ఎందుకో కథ ఫైనల్ న్యారేషన్ అప్పుడు వర్కౌట్ కాదేమో అనిపించి ఈ చిత్రాన్ని ఆపేసారు. అలాగే అప్పట్లో వంశీ పైడిపల్లి దర్శకత్వం లో అక్కినేని నాగార్జున – ఎన్టీఆర్ హీరోలు గా ఊపిరి చిత్రాన్ని ప్రకటించారు.

వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం అవుతుంది అనగా, ఈ సినిమా నుండి తప్పుకున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత ఆయన స్థానం లోకి కార్తీ వచ్చాడు. ఈ పాత్ర అప్పట్లో ఎంత క్లిక్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో అప్పట్లో భారీ బడ్జెట్ తో ‘గరుడ ‘ అనే చిత్రాన్ని చేద్దాం అనుకున్నారు, కానీ ఈ సినిమా కూడా కథ చర్చల దగ్గరే ఆగిపోయింది, భవిష్యత్తులో అయినా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్తుందో లేదో చూడాలి.