Hero Ajith సినిమా అనేది ఒక మాయా ప్రపంచం..ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే..లేనివి ఉన్నట్లు సృష్టించడం సాధారణమే. అందులో నిజం ఉన్నా.. లేకున్నా.. బయటివారికి మాత్రం నిజమే అన్నట్లు కనిపిస్తూ ఉంటుంది..ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో సినిమావాళ్ల గురించి ఎంతగా ట్రోల్స్ వస్తుందో తెలిసిందే..ఎక్కడ ఏ చిన్న తప్పు కనిపించినా దాన్నీ బూతద్దంలో చూపించి పెద్ద సెన్సేషన్ చేస్తున్నారు. ఇంకొందరు లైక్స్ కోసం, పేరు కోసం నోటికి ఏది వస్తే దాన్ని ట్వీట్స్ రూపంలో రాసి ప్రజల మీదకు వదులి విమర్శల పాలవుతున్నారు. ఇలాంటి వారిలో ముఖ్యుడు ఉమైర్ సంధు. గత కొన్ని రోజుల నుంచి కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ ఉన్నట్లు ట్వీట్స్ చేస్తూ నెటిజన్ల సహనాన్ని పరిక్షీస్తున్నాడు.
మొన్నటికి మొన్న కెజిఎఫ్ యష్ తనను వేధించాడని హీరోయిన్ శ్రీనిధి చెప్పిందని చెప్పాడు. అది కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ సమంత కడుపు తెచ్చుకుంది.. గుట్టు చప్పుడు కాకుండా అబార్శన్ చేయించుకుందని చెప్పాడు.. ఇక ఇప్పుడు తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేసాడు.. అది ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతుంది..అజిత్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో అతనికి ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అంతే క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ మధ్యనే తెగింపు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అజిత్, హీరోయిన్ షాలినిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.