Baby Movie : హృదయ కాలేయం అనే సినిమా పోస్టర్ విడుదలైనప్పుడు అసలు ఇది సినిమా నేనా? ఇలాంటి దాన్ని ఎవరైనా తీస్తారా? అని చాలామంది కామెంట్ చేశారు. కానీ చిత్రం విడుదల అయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూసి అందరూ అవాక్కయ్యారు. సంపూర్ణేష్ బాబుని ఓ కొత్త తరహాలో తెరకు పరిచయం చేసి మంచి మార్కులు కొట్టేసిన దర్శకుడు సాయి రాజేష్. కానీ ఆ తర్వాత అతను ఊహించినంత సక్సెస్ అందుకోలేకపోయాడు.
మధ్యలో కలర్ ఫోటో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకొని సక్సెస్ అయ్యాడు. తన శిష్యులలో కొందరినీ డైరెక్టర్లుగా మార్చి సంపూర్ణేష్ బాబుతో సినిమాలు తీసి సాయి రాజేష్ సక్సెస్ అయ్యారు. అయితే అతను రాసిన బేబీ సినిమా కథ ఇంత సక్సెస్ సాధిస్తుంది అని మాత్రం ఎవరూ ఊహించలేదు.
కామెడీ సినిమాలు తీసే సాయి రాజేష్ డెప్త్ గా ఉండే లవ్ స్టోరీని హ్యాండిల్ చేయగలడు అంటే ఎంతోమంది అనుమానం వ్యక్తం చేశారు.కానీ అతనిపై నమ్మకం ఉంచిన నిర్మాత రిస్క్ అయినా పర్లేదు అని ముందుకు రావడంతో విడుదలైన బేబీ చిత్రం ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది
.
అయితే ఇందులో హీరో క్యారెక్టర్ కి ఆనంద్ దేవరకొండ కంటే ముందు కూడా సాయి రాజేష్ మరొక ఇద్దరు హీరోలను సంప్రదించడం జరిగింది. కానీ వాళ్ళు ఈ సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో చివరికి ఆనంద్ దేవరకొండని హీరోగా సెట్ చేశారు. ముఖ్యంగా ఒక హీరో అయితే కథ విన్న తర్వాత ఇంత రిస్కు నేను చేయలేను అని ఓపెన్ గా చెప్పాడట. మరొక హీరో అయితే నిర్మాతకే ఫోన్ చేసి సాయి రాజేష్ లాంటి దర్శకుడు తో అసలు కథ చెయ్యొద్దు అని సలహా కూడా ఇచ్చాడట.
ఈ విషయం తెలిసి అప్పట్లో సాయి రాజేష్ బాగా బాధపడ్డాడట. తన డైరెక్షన్ పై వస్తున్న ప్రశ్నల విషయంలో అతను తీవ్రంగా కలత చెందారు. నిజానికి హృదయ కాలేయం ఒక కామెడీ సినిమా అయినప్పటికీ బేబీ లాంటి సినిమా హ్యాండిల్ చేయడం కంటే ఆ సినిమా తీయడమే ఎంతో కష్టమని సాయి రాజేష్ పేర్కొన్నారు.