Trivikram Srinivas : టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ లీడింగ్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్న ముగ్గురిలో ఒకడు త్రివిక్రమ్ శ్రీనివాస్.రచయితగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన ఆ తర్వాత డైరెక్టర్ గా ఎదిగి ఎన్నో క్లాసికల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించాడు.ఆయన మాటలు వింటే చెవిలో అమృతం పోసినట్టే ఉంటుంది.అందుకే ఆయన సినిమాలకు రిపీట్ వేల్యూ ఎక్కువ.ఒక్క ‘అజ్ఞాతవాసి’ సినిమా మినహా ఆయన కెరీర్ లో తీసిన సినిమాలన్నిటినీ ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టవు.ముఖ్యంగా ఖలేజా చిత్రం బాక్స్ ఆఫీస్ పరంగా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్.కానీ ఇప్పుడు ఆ సినిమాని టీవీ లలో వేసినప్పుడు చూడకుండా ఉండలేం.ఎన్ని సార్లు వేసిన చూసేయొచ్చు,ఆయన రైటింగ్ లో అంత పదునైన డైలాగ్స్ మరియు హ్యూమర్ ఉంటుంది.కానీ ఇదే త్రివిక్రమ్ సినిమాలను ఇతర బాషలలో రీమేక్ చేస్తే మాత్రం డిజాస్టర్ ఫ్లాప్ అయ్యి తీరుతుంది.ఇప్పటివరకు అలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి.ఆ సినిమాలేంటో ఇప్పుడు మనం చూద్దాము.
రైటర్ గా ప్రముఖ దర్శకుడు విజయ భాస్కర్ క్రింద పని చేస్తున్న రోజుల్లో త్రివిక్రమ్ పెన్ నుండి జారిపడిన అద్భుతమైన దృశ్యకావ్యం ‘నువ్వు నాకు నచ్చావ్’.విక్టరీ వెంకటేష్ , ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా ఆరోజుల్లో ప్రభంజనం సృష్టించింది.ఎన్ని వందలసార్లు చూసిన బోర్ కొట్టదు ఈ సినిమా, అంత అద్భుతంగా మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు త్రివిక్రమ్.అయితే ఇదే సినిమాని తమిళం లో విజయ్ ని హీరో గా పెట్టి ‘వసీగర’ అనే పేరు తో రీమేక్ చేసి విడుదల చేస్తే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.ఆ సినిమా అంత పెద్ద డిజాస్టర్ అవ్వడానికి ప్రధాన కారణం ఇక్కడ సూట్ అయ్యినట్టు మాటలు మరియు కామెడీ సన్నివేశాలు పేలకపోవడమే.
ఇక దర్శకుడిగా మారిన తర్వాత ఆయన కెరీర్ లో మైలురాయిగా నిల్చిన చిత్రం ‘అతడు’.సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ కాదు కానీ,హిట్ రేంజ్ అని చెప్పొచ్చు.కానీ టీవీ లో మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్, ఇప్పుడు టెలికాస్ట్ చేసిన అద్భుతమైన TRP రేటింగ్స్ వస్తాయి.అయితే ఈ సినిమాని హిందీ ప్రముఖ హీరో బాబీ డియోల్ ‘ఏక్:ది పవర్ ఆఫ్ వన్’ అనే పేరుతో రీమేక్ చేసారు.కనీసం వారం రోజులు కూడా థియేటర్స్ లో ఉండలేకపోయింది ఈ చిత్రం.అంత పెద్ద డిజాస్టర్ అన్నమాట.
త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కమర్షియల్ గా బాగా వర్కౌట్ అయినా చిత్రం ‘జులాయి’.వరుసగా ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న అల్లు అర్జున్ ని మళ్ళీ హిట్ ట్రాక్ లోకి తెచ్చిన చిత్రమిది.ఈ చిత్రం లోని లాజికల్ సన్నివేశాలు ఆరోజుల్లో ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ అయ్యేలా చేసింది.ఇదే సినిమాని తమిళం లో హీరో ప్రశాంత్ ‘సాగసం’ అనే పేరు తో రీమేక్ చేసారు.కనీసం పోస్టర్ ఖర్చులకు పెట్టినంత కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది.
ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన చిత్రం అత్తారింటికి దారేది.ఈ సినిమా అప్పట్లో సృష్టించిన ప్రభంజనం ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు.పైరసీ అయ్యినప్పటికీ కూడా ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టింది ఈ సినిమా.కథ పరంగా చాలా సాదాసీదా అయ్యినప్పటికీ త్రివిక్రమ్ మాటలు ,స్క్రీన్ ప్లే మరియు పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటన ఈ చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి.అయితే ఇదే సినిమాని తమిళం లో శింబు హీరో గా పెట్టి ‘వంతా రాజావాతేం వరువేన్’ అనే పేరుతో రీమేక్ చేసారు.పెద్ద డిజాస్టర్ అయ్యింది.కానీ కన్నడలో కిచ్చ సుదీప్ ఇదే అత్తారింటికి దారేది చిత్రాన్ని ‘రన్న’ అనే పేరు తో రీమేక్ చేసి పర్వాలేదు అనే రేంజ్ సక్సెస్ ని అందుకున్నాడు.
ఇక త్రివిక్రమ్ కెరీర్ లో మరో ఆల్ టైం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘అలా వైకుంఠపురం లో’.2020 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఇప్పటికీ ఈ సినిమా నాన్ రాజమౌళి హైయెస్ట్ గ్రాసర్ గానే నిల్చింది.ఈ చిత్రాన్ని హిందీ లో ‘షెహ్ జాడ’ అనే పేరు తో రీమేక్ చేసారు.కార్తీక్ ఆర్యన్ హీరో గా నటించిన ఈ సినిమా కేవలం 20 కోట్ల రూపాయిలను మాత్రమే వసూలు చేసి సర్దేసింది.
అలా త్రివిక్రమ్ సినిమాలన్నీ ఇతర బాషలలో రీమేక్ అయ్యి అట్టర్ ఫ్లాప్స్ గా నిలబడడం చూస్తూ ఉంటే, ఆయన సినిమాలు పాన్ ఇండియా ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోవడం లేదని అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నీ మన తెలుగు ఎమోషన్స్ కి దగ్గరగా, మనకి మాత్రమే కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. అందుకే ఇతర బాషలలో సక్సెస్ కావు. ఎందుకంటే త్రివిక్రమ్ చేసినట్టు మేజిక్ అందరు చెయ్యలేరు కాబట్టి.ఇది తెలిసి కూడా ఆయన సినిమాలను రీమేక్ చెయ్యాలి అనుకోవడం మూర్కత్వమే అనుకోవాలి.. ఇప్పటికైనా ఇతర బాషా దర్శకులు ఈ విషయాన్నీ గుర్తిస్తారో లేదో చూడాలి.