Trisha : రే*ప్ కామెంట్స్ పై ఇంత రచ్చ చేసిన.. చివరకు ఇలా హ్యాండ్ ఇచ్చిందేంటి!

- Advertisement -

Trisha పై నటుడు మన్సూర్ అలీఖాన్ మాట్లాడడం చేసిన కామెంట్స్ ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంలో త్రిషకు సపోర్ట్ గా.. చిరంజీవి, లోకేష్ కనగరాజ్, మాళవిక మోహనన్, నితిన్ నిలిచారు. మన్సూర్ చేసిన కామెంట్స్ దారుణమని తప్పుబట్టారు. ఎవరు ఎన్ని మాటలు అన్నాకూడా.. మన్సూర్ మాత్రం తప్పుగా మాట్లాడలేదని తనను తాను సమర్ధించుకున్నారు. ఈ విషయంలో మన్సూర్ అలీఖాన్‌పై చర్యలు తీసుకోవాలని తమిళనాడు డీజీపీకి ఫిర్యాదు చేసింది జాతీయ మహిళా కమిషన్.

Trisha
Trisha

ఈమేరకు మన్సూర్ కు నోటీసులు కూడా జారీ అయ్యాయి. నవంబర్23 ఉదయం 11 గంటలకు స్వయంగా హాజరు కావాలని మన్సూర్ అలీఖాన్‌ను కోరింది. అయితే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన మన్సూర్.. నవంబర్‌ 24న విచారణకు హాజరవుతానని చెప్పాడు. కానీ.. తాజాగా తన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాడు మన్సూర్.. త్రిషకు క్షమాపణలు చెప్పాడు.. ఈ మేరకు ఒక నోట్ రిలీజ్ చేసిన మన్సూర్.. ఆ నోట్ లో ఇలా రాసుకొచ్చారు.. నేను గత వారం రోజులుగా కత్తి లేకుండా యుద్దం చేశాను. రక్తపాతం లేకుండానే ఆ యుద్ధంలో నేను గెలిచాను. ఈ వివాదంలో నాకు అండగా నిలిచిన.. అందరికీ నా ధన్యవాదాలు.

Trisha COmments

నన్ను, నా మాటల్ని తప్పుపట్టిన వారికి వినయపూర్వకమైన నమస్కారములు. నేను చేసిన వ్యాఖ్యలు నటి త్రిష మనసుకు బాధ కలిగించాయి. అందుకు ఆమెకు నేను క్షమాపణ చెబుతున్నా. అని రాసుకొచ్చారు మన్సూర్. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినటైంది. అసలేం జరిగిందంటే.. మన్సూర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తాను ఎన్నో రేప్‌ సీన్లలో నటించానని.. ‘లియో’లో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందని అనుకున్నట్లు చెప్పాడు. ఆ సన్నివేశం లేకపోవడంతో బాధగా అనిపించిందన్నాడు. సంబంధిత వీడియో త్రిష దృష్టికి వెళ్లగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి వల్లే అందరికీ చెడ్డపేరు వస్తోందని పేర్కొన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com