Trisha Krishnan : “గ్రీన్ అమ్మా గ్రీన్.. గ్రీన్ పట్టుచీరలో.. దానికి తగ్గట్టు జాకెట్ వేసుకుని లూస్ హెయిర్‌తో అలా నడిచొస్తూ ఉంటే.. అచ్చం దేవతలా ఉంటుంది.” ఇదెక్కడో విన్నట్టుంది అనుకుంటున్నారా. ఇంకెక్కడ ఆడవారి మాటలకు అర్థాలే వేరులో సినిమాలో హీరోయిన్ కుటుంబంతో షాపింక్ వెళ్లినప్పుడు త్రిష గురించి విక్టరీ వెంకటేశ్ చెప్పే డైలాగ్ ఇది. అప్పుడే అచ్చం వెంకీ వివరించినట్టుగానే త్రిష అదే అట్టైర్లో అలాగే నడిచొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ సీన్ గురించి ఎందుకు అంటారా. అచ్చం అలాంటి సీనే రియల్‌గా కూడా జరిగింది. అవునా ఎక్కడ అనుకుంటున్నారా..? ఇంకెక్కడ పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్‌లో.

పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్స్‌లో త్రిష ట్రెడిషనల్ ఔట్ఫిట్స్లోనే ఎక్కువగా కనిపిస్తోందని మనం ఇప్పటికే చెప్పుకున్నాం కదా. అయితే ఈసారి ఈ చెన్నై చిన్నది చీరలో కనిపించి సందడి చేసింది. అచ్చం ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో వెంకీ డిస్క్రైబ్ చేసినట్టు గ్రీన్ కలర్ శారీలో.. అంటే అక్కడ చెప్పినట్టు పట్టుచీర కాదనుకోండి.. కానీ గ్రీన్ కలర్ చీరనే.

గ్రీన్ కలర్ చీరలో లూస్ హెయిర్‌తో సినిమా ప్రమోషన్స్ కోసం అలా త్రిష నడిచొస్తూ ఉంటే.. దేవకన్యలా కనిపిస్తున్న ఈ బ్యూటీని అక్కడున్నవాళ్లంతా మెస్మరైజ్ అయ్యారు. ఆ ఔట్ఫిట్ ఫొటోలను త్రిష తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

త్రిష కృష్ణన్ గ్రీన్ కలర్ చీరలో త్రిష చాలా సింపుల్‌గా ఎలిగెంట్‌గా కనిపించింది. పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రచారంలో భాగంగా త్రిష ఈ ఔట్ఫిట్లో దర్శనమిచ్చింది. అప్పుడెప్పుడో వర్షం, అతడు సినిమాల్లో త్రిష లంగావోణీలో కనిపించింది. ఆ తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులో సినిమాలో చీరకట్టులో చూశాం. అంతే ఇక ఆ తర్వాత త్రిషను చీరకట్టులో చూసిందేలేదు. చాలా రోజుల తర్వాత త్రిషను ఈ అట్టైర్లో చూస్తుంటే ఎంతో ముద్దుగా అనిపించింది. చీరకట్టులో ఈ చెన్నై చిన్నదాన్ని చూసి తెలుగు కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు.