కొంతమంది స్టార్ హీరోయిన్లు ఎంత వయస్సు వచ్చినా కానీ నేటి తరం స్టార్ హీరోయిన్స్ తో సరిసమానమైన అవకాశాలను దక్కించుకుంటూ తిరుగులేని నెంబర్ 1 గా రాణిస్తుంటారు,అలాంటి హీరోయిన్స్ లో ఒకరే Trisha. చిన్న క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన త్రిష, ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగి వరుసగా హిట్టు మీద హిట్టు కొడుతూ ప్రముఖ స్టార్ హీరోలందరితో కలిసి నటించి సౌత్ లోనే నెంబర్ 1 స్టార్ హీరోయిన్ గా అవతరించింది . Trisha పాటు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎంతో మంది హీరోయిన్లు ఫేడ్ అవుట్ అయిపోయారు.ఈ రెండు దశాబ్దాల ఆమె కెరీర్ లో ఎంతోమంది కుర్ర హీరోయిన్లు వచ్చారు, పోయారు కానీ త్రిష మాత్రం అలాగే ఉంది.40 ఏళ్ళ వయస్సు లో కూడా ఇలాంటి స్టార్ ఇమేజి ని మైంటైన్ చెయ్యడం ఎవరి వల్ల కాదు.
తన పని అయిపోయిందని అనుకున్న ప్రతీసారి దిమ్మతిరిగే బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి తన సత్తా చాటుతూ ఉండేది త్రిష.ఇప్పటికీ కూడా ఆమె అదే చేస్తుంది, కుర్ర హీరోయిన్ల రాకతో త్రిష క్రేజ్ బాగా పడిపోయిందని అందరూ అంటూ ఉండేవారు.కానీ విజయ్ సేతుపతి హీరో గా నటించిన ’96’ అనే సినిమా ద్వారా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది.
ఈ సినిమా త్రిష కెరీర్ లోనే మైలు రాయిగా నిల్చింది.ఆ తర్వాత ఆమె పట్టిందల్లా బంగారం గా మారిపోయింది.గత ఏడాది ఈమె మణిరత్నం దర్శకత్వం లో తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే,సుమారుగా 450 కోట్ల రూపాయిల గ్రాస్ ని ఆ చిత్రం వసూలు చేసింది.ఇప్పుడు ‘పొన్నియన్ సెల్వన్ – 2’ లో నటిస్తుంది.
ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 250 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. ఆ తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ – లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా ఆమె హీరోయిన్ నటిస్తుంది.ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపుగా 200 కోట్ల రూపాయిలు ఉంటుంది.ఈ రెండు సినిమాలతో పాటుగా మలయాళం లో మోహన్ లాల్ తో ఒక సినిమా చేస్తుంది, దానితో పాటుగా మరో రెండు తమిళ సినిమాల్లో మెయిన్ లీడ్ రోల్ చేస్తుంది.ఈ సినిమాల బుడ్జెట్స్ అన్ని కలిపితే 500 కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది.40 ఏళ్ళ వయస్సులో ఇంత బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమాలలో త్రిష ఇప్పటికీ మెయిన్ హీరోయిన్ గా కొనసాగుతుంది అంటే ఆమె రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.