Ranbir Kapoor : రణ్ బీర్ ప్రేమలో మునిగి తేలుతున్న త్రిప్తి డిమ్రీ.. అలియా పరిస్థితేంటో పాపం..

- Advertisement -

Ranbir Kapoor : బాలీవుడ్ స్టార్ హీరో, సందీప్ రెడ్డి వంగా కాంబో లో వచ్చిన యానిమల్ మూవీ ఇటీవల రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. భారీగా కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ చిత్రంలో రణ్ బీర్ సరసన రష్మిక మందన్న, తృప్తి డిమ్రి హీరోయిన్ లు గా నటించారు. అయితే యానిమల్ మూవీ తో యంగ్ బ్యూటీ తృప్తి డిమ్రి ఫేట్ మారిపోయింది. ఆమె బాగా పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో కనిపించింది కాసేపే అయినా తృప్తికి మాత్రం బాగా పేరొచ్చింది. హీరో రణ్‍బీర్ కపూర్‌తో తృప్తి డిమ్రి.. ఇంటిమేట్ సీన్లు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. తృప్తి అందం, నటన ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. దీంతో నేషనల్ క్రష్ అంటూ తృప్తికి పేరు పెట్టేశారు.

అయితే, ఓ ఈవెంట్‍లో హీరో రణ్‍బీర్ కపూర్‌నే తృప్తి తదేకంగా అలాగే చూశారు. ఈ వీడియో వైరల్ అయింది. దీంతో, ఆ వీడియోపై తృప్తి తాజాగా స్పందించారు.ఇటీవల యానిమల్ మూవీ స్క్రీనింగ్‍కు రణ్‍బీర్‌, తృప్తి డిమ్రి సహా మూవీ యూనిట్ సభ్యులు హాజరయ్యారు. అయితే, అప్పుడు ఫొటో షూట్ కోసం వేదిక దగ్గరికి వచ్చారు. అయితే, ఆ సమయంలోనే తన ముందు అటూ ఇటూ తిరిగిన రణ్‍బీర్‌నే తృప్తి చూస్తూ వున్నారు. అతడు ఎటు వెళితే అటే చూశారు. దీంతో రణ్‍బీర్ నుంచి తృప్తి చూపుతిప్పుకోలేకపోతున్నారని, ఆమె ప్రేమలో పడినట్టున్నారని చాలా మంది ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. ఏదో ఉందంటూ కూడా గాసిప్స్ రాసుకొస్తున్నారు. ఈ వీడియో కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది. దీంతో ఈ వీడియో గురించి తృప్తి డిమ్రి మాట్లాడారు.

Ranbir Kapoor Alia Bhatt

ఎవరైనా మన ముందు ఉండి.. ఇతరులతో మాట్లాడుతుంటే ఆ వ్యక్తినే చూస్తాం కదా అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తృప్తి డిమ్రి తెలిపారు.. మాములుగానే రణ్‍బీర్‌ను తాను అలా చూసానని ఆమె చెప్పారు. ఆ రోజు తాను చాలా కంగారుగా ఉన్నానని కూడా తృప్తి తెలిపారు.మేం స్క్రీనింగ్ దగ్గర ఉన్నాం. నటీనటులందరినీ ఒక్కచోటికి తీసుకొచ్చి ఫొటోలు షూట్ చేయాలని అకున్నారు. అందరినీ ఒకచోటికి రమ్మన్నారు. అప్పుడు అక్కడి వారు మాట్లాడుతున్నారు. రణ్‍బీర్ కపూర్ నా ముందే నిలబడి ఎవరితోనే మాట్లాడుతున్నారు. మన ముందు ఎవరైనా నిలబడి మరెవరితోనో మాట్లాడుతుంటే.. సాధారణంగా వారి వైపే చూస్తాం కదా అని తృప్తి డిమ్రి తెలిపారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here