మెగాస్టార్ టు ఐకాన్ స్టార్… టాలీవుడ్ హీరోలకి ఆ స్టార్ బిరుదులు ఏలా వచ్చాయో తెలుసా?

- Advertisement -

సినీపరిశ్రమలో స్టార్​ హీరోల పేర్లకు ముందు టైటిల్స్​ ఉండటం సాధారణమే​. స్టార్​డమ్​ ఆధారంగా ఒక్కో హీరోకు ఓక్కో బిరుదు(టైటిల్​) ఉంటుంది. అభిమానులు కూడా వారిని అవే పేర్లతో ప్రేమగా పిలుస్తుంటారు. థియేటర్లలో ఆయా హీరోల సినిమా రిలీజ్​ అయినప్పుడు కూడా బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ను జోడిస్తూ.. ఇమేజ్​ ట్యాగ్​లైన్​తో స్క్రీన్​పై కథానాయకుల పేరు పడుతుంది. తెరపై తమ అభిమాన హీరో టైటిల్ చూడగానే ఫ్యాన్స్ కూడా ఈలలు, విజిల్స్​తో రెచ్చిపోతుంటారు. ఎందుకంటే ఆ టైటిలే.. తమ హీరో రేంజ్​ ఏందో తెలుపుతుంటుంది. అయితే కొంతమంది నటులకు కెరీర్​ ఆరంభంలో ఉన్న ట్యాగ్​లైన్స్​..​ వారి ఇమేజ్​ పెరిగే కొద్దీ మారిపోతుంటాయి. ఇటీవల స్టైలిష్​స్టార్​ అల్లు అర్జున్​.. ఐకాన్ ​స్టార్​గా మారిన సంగతి తెలిసిందే. ఈయనే కాదు ఇప్పటికే కృష్ణ, చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్​ వంటి పలు హీరోలు కూడా తమ బిరుదులను మార్చుకున్నారు. దానికి సంబంధించిన వివరాల సమాహారమే ఈ కథనం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో కృష్ణకు ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పట్లోనే ఈయన ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీలని పరిచయం చెయ్యడమే కాకుండా ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి భారీ స్థాయిలో చాలా ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నారు. ఈయన కెరీర్ ప్రారంభంలో ‘నటశేఖర’ అనే బిరుదుని సంపాదించుకున్నారు. అయితే.. మాస్ ఫాలోయింగ్​ను సంపాదించుకున్న తరువాత ‘సూపర్ స్టార్’ అనే బిరుదు ఈయనకు లభించింది. ‘సింహాసనం’ సినిమా నుంచి ఈయన సూపర్ స్టార్ కృష్ణగా కొనసాగుతున్నారు.

చిరంజీవి.. ఇక మాస్ అనే పదానికి సరికొత్త నిర్వచనం చెప్పింది చిరంజీవి. ఆయన డ్యాన్సులు, ఫైట్లతో అప్పటి ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసారు తనదైన నటనతో మాస్​ హీరోగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే మొదట ఈయన పేరుకి ముందు డైనమిక్ హీరో అనే టైటిల్​ యాడ్ అయ్యింది. ఆ తర్వాత ‘సుప్రీమ్​ హీరో’గా వెలుగొందిన ఆయన్ను ‘మరణ మృదంగం’ సినిమా తర్వాత ఫ్యాన్స్​ ముద్దుగా ‘మెగాస్టార్’​ అని పిలవడం ప్రారంభించారు.

- Advertisement -

నందమూరి నటసింహం బాలకృష్ణకు మొదట ‘యువరత్న’గా బిరుదు లభించింది. ఆ తర్వాత ‘నట సింహం’గా మారిపోయింది. ప్రస్తుతం బాలయ్య.. గోపిచంద్​ మలినేని దర్శకత్వంలో ఎన్​బీకే 107, అనిల్​రావిపూడితో ఎన్​బీకే 108 చిత్రాలు చేస్తున్నారు.

హీరో నాగార్జునను కెరీర్​ ఆరంభదశలో ‘యువసామ్రాట్​’ అని పిలిచేవారు. అనంతరం ఆయన ‘కింగ్​’గా మార్చుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో బంగార్రాజుతో వచ్చి హిట్ కొట్టారు. త్వరలోనే బ్రహ్మస్త్రం, ది ఘోస్ట్​తో అభిమానులను పలకరించనున్నారు.

పవన్ కళ్యాణ్…. హీరోగా పవన్ కళ్యాణ్ మొదటి చిత్రం “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” సినిమా. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇవివి సత్యనారాయణ డైరెక్ట్ చేసారు. ఆ సినిమా అంతగా నడవలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ‘గోకులంలో సీత’ సినిమా చేసాడు. ఈ చిత్రం తమిళంలో హిట్టైన ‘గోకులతై సీతై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. ఇక ఆ చిత్రానికి పోసాని కృష్ణమురళి మాటలు అందించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా పోసాని కృష్ణమురళి తొలిసారిగా విలేకరుల సమావేశంలో పవన్ కల్యాణ్‌ను పవన్ స్టార్ అని సంబోధించారు. ఆ తర్వాత చాలా పత్రికలు పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ బిరుదుతో కథనాలు రాసాయి.

ఇక నందమూరి వంశం పుత్ర రత్నం ఎన్టీఆర్. ఈయనకు మొదటగా ‘యంగ్​టైగర్’​ బిరుదు ఉండేది. ‘శక్తి’ సినిమాతో ‘ఏ1స్టార్’​ టైటిల్​ యాడ్​ అయింది. కానీ ఇప్పటికీ ‘యంగ్​ టైగర్’​ అనే అభిమానులు పిలుచుకుంటారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ, కేజీయఫ్ డైరెక్టర్​ ప్రశాంత్ నీల్​తో ఓ సినిమా చేస్తున్నారు.

ఇక మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్​స్టార్​ కృష్ణ వారసుడిగా చిన్నవయసులోనే మహేశ్​బాబు చిత్రసీమకు పరిచయమయ్యారు. తండ్రికి తగ్గ తనయుడిగా సూపర్​ ఫ్యాన్ ఫాలోయింగ్​ను సంపాదించుకున్నారు. మొదట ఈయనకు ‘ప్రిన్స్’గా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. స్టార్​డమ్​ పెరుగుతోన్న నేపథ్యంలో ‘పోకిరి’తో ఇండస్ట్రీ హిట్ అందుకుని సూపర్ స్టార్​గా మారారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా తిరుగులేని సూపర్ స్టార్​గా భారీ క్రేజ్ తో దూసుకుపోతున్నారు.

ఇక సీనియర్ నటుడు కృష్ణంరాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్​ బాహుబలితో పాన్ ఇండియా స్టార్​గా ఎదిగాడు. ప్రస్తుతం పలు భారీ చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన మొదటి ఇమేజ్​ ట్యాగ్​లైన్​ యంగ్​ రెబల్​స్టార్. ఆ తర్వాత రెబల్​స్టార్​గా మారారు.

రామ్ చరణ్ హీరోగా  లాంచ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ కు ఉన్న పవర్ స్టార్, చిరంజీవికి ఉన్న మెగా స్టార్ కలిపి మెగా పవర్ స్టార్ అనే బిరుదు ఇచ్చేసింది మీడియా.

అల్లు అర్జున్: మొన్నటి వరకూ స్టయిలిష్ స్టార్ అనే బిరుదు ఉండేది. ఇటీవల జరిగిన ‘పుష్ప’ టీజర్ లాంచ్ లో ‘ఐకాన్ స్టార్’ అనే బిరుదుని బన్నీకి ఇచ్చాడు దర్శకుడు సుకుమార్.

ఇక రవితేజ(మాస్​ హీరో-మాస్​ మహారాజ్​), నరేశ్​(అల్లరి నరేశ్​, శుభప్రదం నరేశ్​, నాంది నరేశ్​) వరుణ్ తేజను మెగా ప్రిన్స్, నాని నాచురల్ స్టార్, ఇలా వారి టైటిల్స్​ ఇమేజ్​ పెరిగేకొద్దీ మారిపోయాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here