Jagapathi Babu : శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ హీరో గా అదే రేంజ్ ఇమేజి ని సంపాదించిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది జగపతి బాబు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.కెరీర్ ప్రారంభం నుండే ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.అయితే వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం తో హీరో గా జగపతి బాబు కెరీర్ ముగిసిపోయింది.

ఒకానొక దశలో జగపతి బాబు ఆర్థికంగా కూడా బాగా ఇబ్బందులు పడ్డాడు.అలాంటి సమయం లో బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ లో లెజెండ్ అనే చిత్రం లో విలన్ గా నటించే ఛాన్స్ దక్కింది.ఈ సినిమాలో బాలయ్య తో పోటాపోటీగా నటించి మంచి మార్కులు కొట్టేసాడు జగపతి బాబు.ఈ సినిమా తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

సౌత్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న విలన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు.అయితే డిమాండ్ పెరిగే కొద్దీ జగపతి బాబు తన రెమ్యూనరేషన్ ని కూడా భారీగా పెంచేసాడు.ఒక్కో సినిమాకి ఆయన మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నాడట.దీనితో తెలుగు లో నిర్మాతలు ఈమధ్య ఈయన వైపు చూడడమే మానేశారు.ప్రస్తుతం జగపతి బాబు కి తెలుగులో కంటే కూడా ఇతర బాషలలోనే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఈయన చేతిలో ‘సలార్‘ అనే భారీ పాన్ ఇండియన్ సినిమా మినహా మరొకటి లేదు.హిందీ లో ఈయన సల్మాన్ ఖాన్ హీరో గా నటిస్తున్న ‘కిసీ కా భాయ్..కిసీ కా జాన్‘ అనే చిత్రం లో విలన్ గా నటిస్తున్నాడు, ఈ చిత్రం తో పాటు తెలుగు లో గోపీచంద్ హీరో గా నటిస్తున్న ‘రామబాణం’, అలాగే మలయాళం లో ‘రుద్రాంగి’ వంటి సినిమాలలో నటిస్తున్నాడు.కానీ తెలుగు లో మాత్రం ఈయన డిమాండ్ చేసే రెమ్యూనరేషన్ ని చూసి భయపడి వెనక్కి వెళ్తున్నారని టాక్.