టాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో శివ బాలాజీ-మధుమిత జంట ఒకటి. 2004లోఇంగ్లీష్ కారన్
అనే మూవీలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే శివ బాలాజీ-మధుమిత మధ్య తొలి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. తర్వాత కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. ఇలా దాదాపు నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నాడు. కానీ, వీరి మధ్య లవ్ ప్రపోజల్స్ లాంటివేమీ లేవు. ఒకరోజు నేరుగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే జాతకాలు కలవలేదన్న కారణంతో బ్రేకప్ చెప్పుకున్నారట.
వీరి ప్రేమ విషయాన్ని శివ బాలాజీ, ఇటు మధుమిత ఇంట్లో వాళ్లకి చెప్పారు. అయితే శివ బాలాజీ ఇంట్లో వెంటనే ఒప్పుకున్నా, మధుమిత ఇంట్లో మాత్రం ఒప్పుకోలేదు. మధుమిత కొద్దిరోజులపాటు ప్రయత్నించి చివరకి ఇంట్లోవారిని పెళ్లికి ఒప్పించింది. ఇంతవరకు అంతా బాగుంది ఇక పెళ్లి ఏర్పాట్లు చేసేముందు జాతకం చూపించాలి అనుకున్నారట కుటుంబీకులు. శివబాలాజీ ఇంట్లో ఈ జాతకాలపై నమ్మకాలు ఎక్కువ. అయితే ఇద్దరి జాతకాలు కలవవు అని జోతిష్యులు చెప్పారు.
ఇదే విషయం శివబాలాజీ ఫోన్ చేసి మధుకు చెప్పగానే తనకు కోపం వచ్చి ఫోన్ పెట్టేసింది. అలా ఏడాదిన్నర మాట్లాడుకోలేదు. వారిద్దరికీ పెళ్లి అయితే శివ బాలాజీ తల్లికి ప్రాణగండం అని చెప్పారట. సంవత్సరం తర్వాత తన అసిస్టెంట్ ద్వారా శివ బాలాజీ మధుమిత గురించి ఆరా తీసి తన వద్దకి వెళ్లాడు. జరిగిందంతా చెప్పి ఈ సారి వదిలేసి వెళ్లనంటూ ప్రాధేయపడటంతో ఆమె సరేనందట. ఆ తర్వాత మరోసారి జాతకాలు చూపిస్తే సరిపోలాయని చెప్పారు. దీంతో వీరిద్దరూ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.
వీరిద్దరూ తాజాగా ఓ షోలో పాల్గొని తమ జ్ణాపకాలను నెమరువేసుకున్నారు. వారిద్దరి మధ్య జరిగిన ఓ సినిమాటిక్ మూమెంట్ గురించి మధుమిత పంచుకుంది. “ఒకసారి చెన్నైలో బస్‌లో సీట్స్ లేక నిల్చొని ప్రయాణిస్తున్నాం. బ్రేక్ వేయగానే దగ్గరకు వచ్చి ముద్దుపెట్టేశాడు. అందరిలో అలా పెట్టేసరికి నాకు ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు” అంటూ శివబాలాజీ చేసిన చిలిపిపని గురించి చెప్పింది.