Agnyaathavaasi : పవన్ కళ్యాణ్ కెరీర్ లో మాయని మచ్చ లాంటి సినిమా ‘అజ్ఞాతవాసి’..కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆ అంచనాలను అందుకోవడం లో ఘోరంగా విఫలం అయ్యింది..పవన్ కళ్యాణ్ కెరీర్ లో డిజాస్టర్ ఫ్లాప్స్ అంతకు ముందు కూడా ఉన్నాయి కానీ..అవి డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యినప్పటికీ ఒక సెక్షన్ అభిమానులకు నచ్చే అంశాలు అందులో పుష్కలంగా ఉన్నాయి.
కానీ ‘అజ్ఞాతవాసి’ చిత్రం లో అలాంటివేమీ ఉండవు..పైగా పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ నుండి వస్తున్న మూడవ చిత్రం కాబట్టి ఈ సినిమా మినిమం లోకి యావరేజి అవుతుందని అనుకున్నారు..కానీ చివరికి సర్దార్ గబ్బర్ సింగ్ రేంజ్ లో కూడా అలరించలేకపొయ్యేసరికి అభిమానులు థియేటర్స్ నుండి ఏడుస్తూ వచ్చారు..అంత పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ ని ఇప్పటికీ మన స్టార్ హీరోలు దరిదాపుల్లోకి కూడా పోలేకున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రానికి ఓవర్సీస్ ప్రీమియర్స్ నుండి దాదాపుగా 1.5 మిలియన్ డాలర్లు వచ్చాయి..అప్పట్లో ఒక్క బాహుబలి 2 సినిమా తప్ప , ఒక్క చిత్రానికి కూడా ఈ స్థాయి వసూళ్లు రాలేదు..ఇప్పటికి అమెరికా లో #RRR మరియు బాహుబలి 2 తర్వాత ప్రీమియర్స్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘అజ్ఞాతవాసి’ చిత్రమే ఉంది..అజ్ఞాతవాసి వచ్చి 5 ఏళ్ళు అయ్యింది..ఈ 5 ఏళ్లలో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి.
కానీ ఒక్క సినిమా కూడా ఈ చిత్రం ప్రీమియర్ వసూళ్లకు దరిదాపుల్లో కూడా రాలేకపోయింది అంటే పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.. మళ్ళీ ఈ రికార్డు ని ‘హరి హర వీరమల్లు’ సినిమాతో పవన్ కల్యాణే బద్దలు కొడతాడని అభిమానులు బలమైన నమ్మకం తో ఉన్నారు..’భీమ్లా నాయక్’ సినిమాతోనే కొట్టాల్సిందని.. కానీ సడన్ రిలీజ్ వల్ల సరిగా షోస్ ప్లానింగ్ చెయ్యకపోవడం తో మిస్ అయ్యిందని.. ఈసారి ఎట్టిపరిస్థితిలో మిస్ అవ్వబోదని అభిమానులు చెప్తున్నారు.