Kushboo : తమిళ, తెలుగు సినిమాలతో అలరించిన నటి కుష్బూ (Kushboo) ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విటర్ ఖాతాలో తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. తనకు జ్వరం, ఒళ్లు నొప్పులు అలసటతో బాధపడుతున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుష్బూ కు ఏమైంది అంటూ ఆరా తీస్తున్నారు.

ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోలు షేర్ చేసిన కుష్బూ చాలా బాధపడుతున్నట్లు తెలిపారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం అన్నీ వేధిస్తున్నాయి. అదృష్టవశాత్తు నేను మంచి ఆసుపత్రిలో చేరాను. ఆరోగ్యం కొంచెం బాలేకపోయినా దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు. అలా పట్టించుకోకపోతే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అని చెప్పారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు కుష్బూ (Kushboo) వెల్లడించారు.
కలియుగ పాండవులు అనే సినిమాతో వెంకటేష్ (Venkatesh) సరసన హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ హీరోయిన్ టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని దాదాపు అందరూ అగ్ర హీరోలతో నటించింది. ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) హీరోగా వచ్చిన వారీసు సినిమాతో మన ముందుకు వచ్చింది. అలరించింది.