నేడు కోట్లాది మంది భారతీయులు గర్వంగా ఫీల్ అయ్యే రోజు. ప్రపంచం లో ఏ దేశానికీ కూడా సాధ్యం కానీ ఘనత మన ఇండియన్స్ కి సాధ్యపడింది. ఇస్రో సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారు 600 కోట్ల రూపాయిల వ్యయం తో ‘చంద్రయాన్ – 3’ ని తయారు చేసారు. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఏళ్ళ తరబడి ఈ ప్రాజెక్ట్ మీద పని చేసారు. చంద్రుడి దక్షిణ ఉపరితల పై ఇప్పటి వరకు ఏ దేశం కూడా తమ సాటిలైట్ ని లాంచ్ చెయ్యలేకపోయింది.

ఆ ఘనత నేడు మన ఇండియన్స్ కి దక్కింది. అనితరసాధ్యమైన ఈ టాస్కుని పూర్తి చేయగలమా లేదా అనే సందేహం తో భయపడుతూ ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలకు నేడు చంద్రయాన్ దక్షిణ ఉపరితల పై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది అనే విషయాన్నీ తెలుసుకొని సంబరాలు చేసుకున్నారు. రాజకీయ ప్రముఖుల నుండి సినీ ప్రముఖుల వరకు ప్రతీ ఒక్కరు ఈ సక్సెస్ పై ఎంతో గర్విస్తూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ , చిరంజీవి ఇలా ఎంతో మంది ఈ సందర్భంగా తమ ఆనందాన్ని పంచుకుంటూ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఇక కొన్ని మూవీస్ హ్యాండిల్స్ అయితే పనిలో పని మన సినిమాకి కూడా ప్రొమోషన్స్ వస్తుంది కదా అని చంద్రయాన్ కి కలిసి వచ్చేలా ఎలివేషన్స్ వేస్తూ ట్వీట్స్ వేస్తున్నారు.

ముఖ్యంగా ఓజీ మరియు #RRR చిత్రాలను నిర్మించిన డీవీవీ సంస్థ ట్విట్టర్ లో #OG ఆఫ్ ఆల్ సాటిలైట్స్ అంటూ చంద్రయాన్ 3 సక్సెస్ పై పొగడ్తలతో ముంచి ఎత్తాడు. అలాగే #RRR చిత్రం లోని ఆఖరి షాట్ లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి జెండా పట్టుకున్న ఫోటోని షేర్ చేస్తూ ‘ఎత్తరా జెండా’ అంటూ ఒక పోస్ట్ వేసాడు. అలాగే విజయ్ దేవరకొండ కూడా ఇలాంటి పోస్టు ఒకటే వేసి శుభాకాంక్షలు తెలియచేసాడు. ఇలా టాప్ సెలబ్రిటీస్ అందరూ శుభాకాంక్షలు తెలియచేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.
