Tollywood Actors : ఆ హీరోలు ఉంటున్న ఇల్లు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

- Advertisement -

Tollywood Actors : సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల జీవితం గురించి తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు..వారి జీవనశైలి గురించి తెలుసుకోవాలని సామాన్యులు ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. వారు వేసుకునే బట్టలు, తిరిగే కార్లు, ఉండే ఇళ్లు.. ఇలా అన్నిటిపై దృష్టి సారిస్తుంటారు. వాటి ఖరీదు తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే మన టాలీవుడ్ లో కొందరి హీరోల ఇల్లు చూడడానికి అద్దాల మేడల్లా ఉంటాయి. ఇక వాటి ధర తెలిస్తే కళ్లు తేలేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్టార్ హీరోలు ఎవరో వారి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Tollywood Actors
Tollywood Actors

మహేష్ బాబు.. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. తర్వలోనే ఈయన దర్శకధీరుడు రాజమౌళితో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించబోతున్నారు. మహేష్ బాబు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన అభిరుచులకు అనుగుణంగా ఓ ఇంటిని నిర్మించుకున్నారు. ఇది ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్, కస్టమ్-బిల్ట్ జిమ్ మరియు సంపన్నమైన ప్రైవేట్ ఆఫీస్‌ను కలిగి ఉంది. దీని విలువ రూ. 30 కోట్లు ఉంటుందట…ఇకపోతే ఎన్టీఆర్.. నందమూరి ఫ్యామిలీతో నుంచి వచ్చినప్పటికీ స్వయంకృషితో స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్తో గ్లోబర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈయనకు హైదరాబాద్ లో రెండు ఇళ్లు ఉన్నాయి. ఒకటి మెహదీపట్నంలో ఉండగా.. ఎన్టిఆర్ చిన్నతనం నుండి ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ ఇంటి ధర రూ. 30 కోట్ల వరకు ఉంటుందట. అలాగే జూబ్లీహిల్స్ లో ఎన్టీఆర్ కు రూ. 40 కోట్లు విలువ చేసే మరో ఇల్లు కూడా ఉంది..

Star Heroes
Star Heroes

రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్‌ తో గ్లోబర్ స్టార్ గా అవతరించిన ఈయనకు తన భార్య ఉపాసన ఓ ఇంటిని బహుబతిగా ఇచ్చింది. ఈ ఇల్లు జూబ్లీహిల్స్ లోనే ఉంది.. దాని విలువ 80 కోట్లకు పైగా ఉంటుంది..ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన ఆ ఇంట్లోనే ఉంటుంది..అదే విధంగా అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడీయన. ఐకాన్ స్టార్ ఇల్లు ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. జూబ్లీహిల్స్‌లోనే అల్లు అర్జున్ ఇల్లు కూడా ఉంది.

- Advertisement -

అన్ని సౌకర్యాలతో అత్యంత విలాంగా ఉండే ఈ ఇంటి ధర రూ. 100 కోట్లు పైగా ఉంటుందట.. ఇప్పుడు మరో ఇల్లును కూడా కడుతున్నారు.. ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్న ఈయనకు జూబ్లీహిల్స్‌లో విశాలమైన భవనం ఉంది. జిమ్, గార్డెన్, స్విమ్మింగ్ పూల్స్ ఇలా అన్ని సౌకర్యాలు ఈ ఇంట్లో ఉంటాయి. ఈ ఇంటి ఖరీదు దాదాపు రూ. 60 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.. ఇంకా చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలు కూడా రిచ్ హౌస్ లలోనే ఉంటున్నారు.. వాళ్లకు ఏ మాత్రం తగ్గకుండా స్టార్ హీరోయిన్ల ఇల్లు కూడా ఉంటున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here