Pallavi Prashanth : నిన్న గాక మొన్న ప్రారంభం అయ్యినట్టు అనిపిస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 అప్పుడే చివరి వారం కి చేరుకుంది. ఇప్పటి వరకు ప్రసారమైన అన్నీ సీజన్స్ లో ఈ సీజన్ టీఆర్ఫీ రేటింగ్స్ పరంగా సెన్సషనల్ హిట్ అని చెప్తున్నారు. టీం ఈ సీజన్ సక్సెస్ పై ఎంతో సంతోషం ని వ్యక్తపర్చింది. ఈ సీజన్ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి అమర్ దీప్ మరియు శివాజీ ముఖ్య కారణాలు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీళ్లిద్దరి టీఆర్ఫీ రేటింగ్స్ అవసరమైన కంటెంట్ ఇచ్చారు.

అలాగే వీళ్ళ తర్వాత పల్లవి ప్రశాంత్ కూడా ఈ సీజన్ ఇంత పెద్ద హిట్ కావడానికి ముఖ్య కారణాలలో ఒకటి అయ్యాడు. అయితే ఇప్పుడు ఫినాలే వీక్ రావడంతో ఎవరు టైటిల్ గెలుస్తారు అనే విషయం ఇప్పుడు ఆడియన్స్ లో ఉత్కంఠ ని రేపుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్నా పొలింగ్స్ ప్రకారం విన్నర్ మరియు రన్నర్ రేస్ అమర్ దీప్ మరియు పల్లవి ప్రశాంత్ మధ్య ఉండబోతుంది అనే విషయం తెలుస్తుంది.

వీళ్ళ ఇద్దరితో సమానంగా శివాజీ కి కూడా విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. టాప్ 3 లో ఉన్న ఈ ముగ్గురికి ఓటింగ్స్ వేరే లెవెల్ లో పడుతున్నాయట. ఈ ముగ్గురిలో ఎవరు గెలిచినా అతి తక్కువ మెజారిటీ తోనే గెలుస్తారని తెలుస్తుంది. అయితే గత వారం పల్లవి ప్రశాంత్ తో జరిగిన గొడవలో అమర్ దీప్ విచిత్రమైన ప్రవర్తన ఎలా ఉన్నిందో అందరికీ తెలిసిందే. ఈ ప్రవర్తన కారణంగా ఆయనకీ సోషల్ మీడియాలో నెగటివిటీ బాగా పెరిగిపోయింది.

నాగార్జున కూడా నీకు చాలా బాగా డ్యామేజ్ జరిగింది అని నేరుగా చెప్పేయడం తో అమర్ దీప్ లో టైటిల్ గెలుచుకుంటాను అనే ఆశలు తగ్గిపోయాయి అనుకోవచ్చు. టాప్ 3 కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ప్రతీ సీజన్ లో 30 లక్షలు వరకు డబ్బులు ఆఫర్ చేస్తారు. సీజన్ 5 లో సోహెల్, అలాగే సీజన్ 6 లో శ్రీహాన్ ఈ ఆఫర్ కి ఒప్పుకుంటారు. అమర్ దీప్ కచ్చితంగా టాప్ 3 లో ఉంటాడు కాబట్టి ఆయన ఈ ఆఫర్ ని ఒప్పుకుంటాడని అనుకుంటున్నారు. అంటే టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్, మరియు ప్రైజ్ మనీ విన్నర్ గా అమర్ దీప్ నిలుస్తాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంచనా వేస్తున్నారు.