Pawan Kalyan లేటెస్ట్ మూవీ OG టైటిల్ మారనుందా..? OG కాస్త హంగ్రీ చీతాగా ఉంటుందా? ఇప్పుడు అభిమానులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాహో ఫేమ్ సుజిత్ – పవన్ కళ్యాణ్ కాంబోలో ఓజీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా లేకుంటే ఈమేరకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ పవన్ పూర్తిగా రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా ఆలస్యమవుతుంది.

పొరుగు రాష్ట్రం ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాతనే సినిమాను పూర్తి చేస్తాం అంటున్నారు. ఇదిలా ఉంటే..ఇప్పుడు ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. తాజాగా ఈ సినిమా నిర్మాత దానయ్య ఫిలిం ఛాంబర్‌లో ‘హంగ్రీ చీతా’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. ఈ టైటిల్ ఎవరి కోసం అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ప్రస్తుతం పవన్ తో చేస్తున్న సినిమా కోసమే అని ఫ్యాన్స్ అంటున్నారు. ముందుగా ఈ చిత్రానికి ‘దే కాల్ హిమ్ ఓజీ’ అనే టైటిల్‌ను ప్రకటించారు. గ్లింప్స్ కూడా అదే టైటిల్‌ని పెట్టించి చిత్ర బృందం. కానీ గ్లింప్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో హంగ్రీ చీతా అనే పదం చాలా ఆకట్టుకుంటుంది.

పవన్ కళ్యాణ్ పాత సినిమాల వీడియోలను కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గా హంగ్రీ చీతా పెట్టుకుని అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో దానయ్య అదే టైటిల్‌ను రిజిస్టర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ‘దే కాల్ హిమ్ ఓజీ’ అనే టైటిల్‌ని మార్చి హంగ్రీ చీతా అని ఫిక్స్ చేస్తున్నారా.. లేక మరో హీరో కోసం ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారా అనే చర్చ జోరుగా సాగుతోంది.
ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ కి సెట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ టైటిల్ ఎవరి కోసమో నిర్మాతే చెప్పాలి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో పవన్ కు జోడీగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.