Nupur Sanon : అతడిని ప్రేమించి మోసపోయాను.. బాత్రూంలోకి వెళ్లి ఏడ్చాను.. తన లవ్ బ్రేకప్ బయటపెట్టిన నుపుర్ సనన్

- Advertisement -

Nupur Sanon : రవితేజ.. హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ఈ సినిమా దసరా కానుకగా రాబోతుంది. అభిషేక అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు. డైరెక్టర్ నాగవంశీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రవితేజ సరసన బాలీవుడ్ హీరోయిన్స్.. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళి శర్మ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది.

Nupur Sanon
Nupur Sanon

ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నుపుర్ సనన్ హీరోయిన్ కృతిసనన్ ఓన్ సిస్టర్ అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సూపర్ మోడల్, ప్రైవేట్ ఆల్బమ్స్ తో గుర్తింపు సంపాదించుకున్న ఆమె రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో తెలుగు తెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ బ్రేకప్ గురించి తెలిపింది. తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ నుపుర్ సనన్ ను సదరు యాంకర్ మీరు ఎవరినైనా ప్రేమించారా అన్న కశ్చన్ అడిగారు. దానికి ఆమె.. కాలేజీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను చాలా చాలా సిన్సియర్ గా ప్రేమించాను. కానీ అతడు తనని మోసం చేస్తున్నారని అర్థమయ్యేలోపే తనతో ప్రేమలో చాలా దూరం వెళ్లిపోయాను.

- Advertisement -
Kriti Sanon

తనను గుడ్డిగా నమ్మేశాను. కానీ తాను మోసం చేశాడని తెలుసుకున్నాక.. చాలా బాధపడ్డాను. విషయం ఇంట్లో వాళ్లకు ఎక్కడ తెలిసిపోతుందోనని భయపడి రాత్రిపూట బాత్రూంలో వెళ్లి మరీ వెక్కి వెక్కి ఏడ్చాను.. ఆ బాధ నుంచి బయట పడడానికి చాలా టైం పట్టిందని నుపుర్ సనన్ తెలిపింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com