Vijay Devarakonda : విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు అతడు యూత్ ఐకాన్. కెరీర్ స్టార్టింగ్ లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో విజయ్ ఆశలు అడియాశలయ్యాయి. తర్వాత వచ్చిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి.
ఇది ఇలా ఉంటే విజయ్ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల, విజయ్ బర్త్ డే సందర్భంగా ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు. ఆ రోజున పోస్టర్ కూడా విడుదల చేశారు. పాన్-ఇండియా లెవెల్లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమా తర్వాత షెడ్యూల్ గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపికకు కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు మేకర్స్.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో టాలెంట్ ఉండి సినిమాల్లో రావాలని అనుకునే కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. కాస్టింగ్ కాల్ పోస్టర్ కూడా పెట్టారు. యాక్టింగ్ వస్తే చాలు, తెలుగొస్తే సంతోషం, గోదారి యాసొత్తే ఇంకాపేవోడే లేడు.. అంటూ కొత్తగా రాసుకొచ్చారు. ఈ మేరకు మీ ప్రొఫైల్‌లను svc59casting@gmail.com కు పంపాలని సూచించారు.. లేదా మీ ప్రొఫైల్‌ని 91 9676843362కు వాట్సాప్ చేయాలన్నారు. మరి మీకు నటనపై ఆసక్తి ఉండి, గోదావరి యాసపై పట్టు ఉంటే ఈ సినిమాలో నటించే అవకాశం దక్కుతుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో పాన్-ఇండియా మూవీ చేస్తున్నాడు.
Acting osthe chaaalu…😊
తెలుగొస్తే సంతోషం… 🤗
గోదారి యాసొత్తే ఇంకాపేవోడే లేడు 🫡Put yourself on the Big Screen &
The Bigger World of #SVC59 ✊Share your profiles on svc59casting@gmail.com
(or)🗨️ WhatsApp on +91 9676843362@TheDeverakonda @storytellerkola@SVC_official pic.twitter.com/4yNBePoGvH— Sri Venkateswara Creations (@SVC_official) June 19, 2024