2 వ రోజు కూడా హౌస్ ఫుల్స్.. బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తున్న ‘తొలిప్రేమ’ రీ రిలీజ్!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీ గా పేరొందిన ‘తొలిప్రేమ’ సినిమాని 4K HD క్వాలిటీ కి మార్చి, రీసెంట్ గానే గ్రాండ్ గా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నెలలో పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ చిత్రం విడుదల కాబోతుండడం, దానికి తోడు ఈ సినిమాకి వచ్చే వసూళ్లు మొత్తం జనసేన పార్టీ కి డొనేషన్స్ రూపం లో చేరవు కనుక, ఈ చిత్రాన్ని పట్టించుకోకపోవడం మంచిది అని అభిమానులు సోషల్ మీడియా లో మొదటి నుండి ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేస్తూ వచ్చారు.

తొలిప్రేమ
తొలిప్రేమ

కానీ విడుదల తర్వాత మాత్రం పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ఈ సినిమాని అభిమానులు ప్రోత్సహించారా లేదా అనేది పక్కన పెడితే , ఆడియన్స్ మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. మొదటిరోజు ఈ చిత్రానికి విడుదలైన కొత్త సినిమాలకంటే బంపర్ ఓపెనింగ్ దక్కింది.

ఇక రెండవ రోజు కూడా ఈ చిత్రానికి చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో అయితే నిన్న ఈ చిత్రానికి 50 షోస్ వేశారు. ఈ 50 షోస్ కూడా హౌస్ ఫుల్ అయ్యాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. వీటి ద్వారా ఈ చిత్రానికి కేవలం హైదరాబాద్ సిటీ నుండి నిన్న 20 లక్షల రూపాయిలు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ చిత్రానికి హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి.

- Advertisement -
Pawan Kalyan

అలా మొత్తం మీద రెండవ రోజు ఈ సినిమాకి సుమారుగా 40 లక్షల రూపాయిల గ్రాస్ , మరియు ఇప్పటి వరకు టోటల్ కోటి 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఈరోజు ఆదివారం కావడం తో, నేడు కూడా ఈ చిత్రానికి మంచి గ్రాస్ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు , మరి క్లోసింగ్ లో ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

toliprema re release
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here