Junior NTR : ఆ సినిమా హిట్ కాదని తెలిసినా ఎన్టీఆర్ తీసిన సినిమా ఏదో తెలుసా ?

- Advertisement -


Junior NTR : సీనియర్ నటుడు దివంగత నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించారు. ఇదే క్రమంలో శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమా చేశారు. కాగా ఇది ఎన్టీఆర్ నటించిన చివరి సినిమా. ఈ సినిమాని అగ్ర దర్శక రచయిత బాపు – రమణ రూపొందించాడు. కాగా ఈ మూవీ ఆడదని ఎన్టీఆర్‎కు ముందే తెలసి కూడా నటించారట. తెలుగులో మహాకవి శ్రీనాథుడి జీవితం గురించి అందరికీ చెప్పాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడట.

Junior NTR
Junior NTR

ఆయన ఆలోచనలు బాపూ – రమ‌ణ‌ల‌కి తెలియజేయగా ఎన్టీఆర్ నిర్ణయానికి బాపు రమణలు బదులిస్తూ.. సాధారణ ప్రేక్షకులకు ఎవరికి శ్రీనాథుడి గురించి పెద్దగా తెలియదు. అంతేకాదు శ్రీనాథుడి జీవితంలో కూడా అంత ఆసక్తిగా కథ ఏమీ ఉండదు.. దీనిని సినిమాగా తీస్తే ఆర్థికంగా నష్టం వస్తుందంటూ చెప్పారట. ఇక ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న ఎన్టీఆర్.. అది కష్టమో, నష్టమో తెలిసిన కూడా వెనకడుగు వేయలేదట. ఈ క్రమంలోనే బాపూ రమణలతో ఎన్టీఆర్.. నష్టం వచ్చిన పర్లేదు ప్రేక్షకుల ఆదరణ లేకపోయిన సమస్య కాదు. మనం శ్రద్ధతో సినిమా తీద్దాం. అందరూ చూడకపోయినా కొందరైనా చూస్తారు. అది చాలు నాకు అన్నారట.

శ్రీనాథుడు పాత్ర చేయాలన్న నా కోరిక కూడా నెరవేరుతుందంటూ సినిమాను మొదలుపెట్టాడట. ముందుగా అంచనా వేసినట్లు ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు. ఈ సినిమాకి ముందు ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ లాంటి పవర్ఫుల్ మూవీ లో ప్రేక్షకులను మెప్పించాడు. ఎన్టీఆర్ ని అలాంటి రోల్ లో చూసిన తర్వాత సడన్ గా ఓ క‌విగా సాఫ్ట్ రోల్ లో ఎన్టీఆర్ ను ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. కాగా ఈ సినిమాలో జయసుధ, రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాతోనే స్టార్ కమెడియన్ ఏవీఎస్, గుండు సుదర్శన్ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. కె.వి మహదేవన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com