Manchu Manoj: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఎనేర్జిక్ స్టార్ లలో మంచు మనోజ్ ఒకరు. మంచు మనోజ్ మూవీ ఇప్పుడంటే ఎవరు పట్టించుకోవడం లేదు కానీ ఒకప్పుడు మాత్రం అయన మూవీస్ కి ఇండస్ట్రీలో స్పెషల్ ప్లేస్ ఉండేది. ముఖ్యంగా అతని మూవీస్ లలో సాంగ్ ఎవర్ గ్రీన్ గా ఉండేవి. మనోజ్ కు మంచి మ్యూజిక్ సెన్స్ ఉందని, అది వాళ్ళ నాన్న నుండి మనోజ్ కు వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణు చెప్తారు. అయితే ఇప్పుడు మంచులో ఫ్యామిలీలోకి ఒక కొత్త మెంబెర్ యాడ్ అయ్యారు.
గత ఏడాది మార్చ్ 3న మనోజ్ కు భూమా మౌనికతో పెళ్ళైన విషయం తెలిసిందే. ఆపెళ్లి చాల సింపుల్ గా మంచు లక్ష్మి ఇంట్లో ఆ పెళ్లి జరిగింది. అయితే ఆపెళ్ళికి కూడా మంచు ఫ్యామిలీ మొత్తం రాలేదు. పెళ్లి మొత్తం బాగా జరిగింది. కొన్ని రోజుల క్రితం తానూ తండ్రిని కాబోతున్నానని మనోజ్ ప్రకటించగా, నిన్న మనోజ్, మౌనికలకు ఒక బేబీ గర్ల్ పుట్టింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులే సోషల్ మీడియాలో తెలిపారు.
ఆ అమ్మాయిని ఎంఎం పులి అని పిలుచుకుంటామని మంచు లక్ష్మి సోషల్ మీడియాలో పంచుకున్నారు. మౌనికకు ధైరవ్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ఫ్యామిలీలోకి వ్యక్తి రావడంతో మంచు ఫ్యామిలీ ఆనందంలో మునిగితేలుతున్నారు. మంచు మోహన్ బాబు స్పందన ఎలా ఉందన్న విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఆయన కూడా బేబీ గర్ల్ ను మురిసిపోతుంటాడేమో.