Sai Pallavi :షూటింగ్ లో అవి ఉండాల్సిందే.. లేదంటే వెళ్ళిపోతా..! నిర్మాతలకు సాయి పల్లవి వార్నింగ్

- Advertisement -

Sai Pallavi : ప్రస్తుతం యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సాయి పల్లవి కచ్చితంగా మొదటి స్థానం లో ఉంటుంది. ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని తన అద్భుతమైన డ్యాన్స్ తో కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను కొల్లగొట్టిన సాయి పల్లవి టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చింది.

ఆ తర్వాత మలయాళం లో ‘ప్రేమమ్’ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ కొట్టి భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో ‘ఫిదా’ చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కేవలం సాయి పల్లవి వల్లే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యిందని అంటూ ఉంటారు అభిమానులు.

అలా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేస్తూ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ని ఏర్పాటు చేసుకున్న సాయి పల్లవి ని ఇండస్ట్రీ లో అందరూ లేడీ పవర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. అంతే కాకుండా సాయి పల్లవి మిగిలిన హీరోయిన్స్ లాగ పెద్ద పెద్ద గొంతెమ్మ కోరికలను నిర్మాతలను కోరదు. ఆమె సెట్స్ లోకి వచ్చిన తర్వాత ఆమె కోరేది కేవలం రెండే.

- Advertisement -

‘నేను సెట్స్ లో ఉన్నప్పుడు ప్రతీ రోజు నాకోసం రెండు నుండి మూడు లీటర్ల కొబ్బరి నీళ్లు తెప్పించండి. అది కాకపోతే చల్లని మజ్జిగ అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా నేను సెట్స్ లోకి అడుగుపెట్టను’ అని నిర్మాతలకు చాలా స్ట్రిక్ట్ గా చెప్తుందట. ఇకపోతే ప్రస్తుతం ఆమె నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘తండేల్’ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here