Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా టైటిల్ ఇదేనా..ఫ్యాన్స్ చూస్తే ఏమైపోతారో!

- Advertisement -

Mahesh Babu : ‘గుంటూరు కారం’ చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న వార్త బయటకి వచ్చినా అది తెగ వైరల్ గా మారిపోతుంది. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ కోసం జర్మనీ లో పలు టెస్టులు చేశారట. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అవ్వడం తో ఇక ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నాడు రాజమౌళి.

అయితే రాజమౌళి మొదటి నుండి తన టీం లో ఒక్కరిని కూడా మార్చకుండా సినిమాలు చేస్తూ ఇన్ని రోజులు వచ్చాడు. కానీ ఈసారి సినిమాటోగ్రాఫర్ ని మార్చేశాడు. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న పీఎస్ వినోద్ ని ఈ సినిమా కోసం తీసుకున్నారు. అలాగే ఇండోనేషియా కి చెందిన ఒక టాప్ హీరోయిన్ ని ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర కోసం తీసుకొచ్చారు రాజమౌళి.

మరికొద్ది రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రానున్నాయి. రాజమౌళి నే స్వయంగా ఈ సినిమాకి సంబంధించిన వివరాలను ప్రెస్ మీట్ ద్వారా తెలియచెయ్యబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అదేమిటంటే ఇన్ని రోజులు ఈ సినిమాని #SSMB29 అనే టైటిల్ తో పిలిచేవారు ఫ్యాన్స్.

- Advertisement -

కానీ ఇక నుండి మాత్రం #SSRMB పేరుతో పిలవాలట. రాజమౌళి స్వయంగా టైటిల్ ని అధికారిక ప్రకటన చేసేవరకు ఈ వర్కింగ్ టైటిల్ తోనే పిలవాలని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఇకపోతే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది చివరి నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మూడు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతుంది అట. ఇందుకోసం రాజమౌళి మహేష్ బాబు నుండి నాలుగేళ్ల కాల్ షీట్స్ తీసుకున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here