చాలామంది సెలబ్రిటీలు సెలబ్రిటీలని పెళ్లి చేసుకుంటుంటారు. కొంతమంది హీరోయిన్లు వ్యాపారవేత్తల్ని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరం అయిపోయి విదేశాల్లో సెటిల్ అవ్వడం వంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే విడాకులు ఇచ్చినా, భర్తలు చనిపోయిన బాధ్యతలు నెరవేరుస్తూ సింగిల్ గా ఉంటున్న హీరోయిన్స్ వివరాలను చూద్దాం.. చాలామంది సెలబ్రిటీలు పెళ్లి తర్వాత ఎక్కువకాలం కలిసి ఉండలేకపోతూ ఉంటారు విడాకులు తీసుకుంటూ ఉంటారు ఇంకొకరిని పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోతూ ఉంటారు. భర్త లేదా భార్య మీద ప్రేమ అభిమానం కారణంగా ఇలా జరుగుతూ ఉంటాయి.
కొంతమంది హీరోయిన్లు అయితే విడాకులు తీసుకున్న తర్వాత భర్త చనిపోయిన కూడా ఇంకో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్నారు. అలా ఒంటరిగా లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరో చూద్దాం.. హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ ఈమధ్య మరణించిన విషయం తెలిసిందే మీనా అతనితో విడాకులు తీసుకోలేదు. కానీ చివరి నిమిషం దాకా వీళ్లు విడిగానే ఉన్నారు చనిపోయిన కూడా మీనా తన ధర్మాన్ని నెరవేర్చింది ప్రస్తుతం సింగిల్ గానే ఉంటోంది.
మరో పెళ్లి చేసుకోలేదు.
హీరోయిన్ కళ్యాణి భర్త సూర్య కిరణ్ కూడా మరణించారు. గతంలో విడాకులు తీసుకుని విడిగానే ఉంటున్నారు. విడిపోయిన మళ్లీ పెళ్లి చేసుకోలేదు సూర్యకిరణ్ మరణించిన తర్వాత కూడా వ్యక్తిగత జీవితంలోకి ఇంకో వ్యక్తికి ఛాన్స్ ఇవ్వలేదు. నటి రోహిణి రఘువరన్ ని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకుంది. విడాకులు తీసుకున్నారు వీళ్ళు. అయినా కుమారుడిని పెంచుకుంటూ రోహిణి విడిగానే ఉంటోంది. భానుప్రియ భర్తని కొన్నాళ్ల క్రితం కోల్పోయింది దానికంటే ముందు భర్తతో విడిపోయింది అమెరికాకి చెందిన అతన్ని భానుప్రియ పెళ్ళి చేసుకుంది. అయితే కొన్ని కారణాల వలన విడిపోయారు భర్త మరణాన్ని మాత్రం తట్టుకోలేకపోయింది సింగల్ గానే ఉంటోంది.