Allu Arjun : అల్లు అర్జు్న్ ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉన్న పేరు. మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో అల్లు వారి ఆశీస్సులతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అల్లు అర్జున్. రాఘవేంద్రరావు 100వ సినిమా గంగోత్రితో హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ఆర్య సినిమాతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. పుష్ప సినిమాతో తొలిసారి పాన్ ఇండియా హీరోగా నిలిచారు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. తర్వాతోనే ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు అల్లు అర్జున్.

ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రంగా చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ నేడు ఐకాన్ స్టార్ గా ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోగా కొనసాగుతున్నారు. ఎన్నికలు పూర్తయిన దగ్గరనుంచి అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య వైరం నడుస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ క్యాండిడేట్ శిల్పా రవికి ఎన్నికల్లో సపోర్ట్ చేసిన విషయం అందరికీ తెలిసినదే. దీంతో జనసైన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
మెగా ఫ్యాన్స్ ఆయనను దారుణంగా ట్రోల్ చేశారు. అయితే అసలు అల్లు అర్జున్ జనసేనకు సపోర్ట్ చేయకుండా వైసీపీకి ఎందుకు మద్దతు ఇచ్చాడన్న విషయంపై తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. బన్నీ వాసుకు టికెట్ ఇవ్వమని అల్లు అరవింద్ చాలా సార్లు పవన్ కళ్యాణ్‌ను కోరాడట. అయితే పవన్ కల్యాణ్ ఆయనకు టికెట్ ఇవ్వలేదట. ఈ క్రమంలోనే హర్ట్ అయిన అల్లు ఫ్యామిలీ జనసేనకు సపోర్ట్ చేయకుండా వైసీపీకి సపోర్టు ఇచ్చిందట. ఇప్పుడు ఇదే వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది. దీంతో అల్లు అర్జున్, మెగా ఫ్యాన్స్ మధ్య వార్ మరింత ఫీక్స్ స్టేజ్ కు వెళ్లిపోయింది.