Kalki 2 : ‘కల్కి 2’ లో భీష్ముడి పాత్రలో కనిపించబోతున్న సూపర్ స్టార్..ఫాన్స్ కి ఇక పండగే!

- Advertisement -

Kalki 2 : ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం ఇప్పుడు కల్కి మేనియా లో మునిగిపోయింది. తెలుగు, హిందీ, తమిళం అని తేడా లేకుండా అన్నీ భాషల్లో ఈ చిత్రం కాసుల కనకవర్షం కురిపిస్తుంది. ప్రభాస్ స్టార్ స్టేటస్ తో పాటుగా , మహాభారతం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమా కావడంతో చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఈ సినిమా ని చూసేందుకు క్యూలు కట్టేస్తున్నారు. కేవలం మూడు రోజుల్లోనే 415 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఇదే ఊపుని కొనసాగిస్తూ ముందుకు పోతే రాబొయ్యే రోజుల్లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. అయితే కల్కి చిత్రానికి రెండవ భాగం కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే అధికారిక ప్రకటన చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.

Kalki 2898 AD (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

ఆ చిత్ర నిర్మాత అశ్వినీదత్ ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఇప్పటికే పార్ట్ 2 కి సంబంధించి 60 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని, కేవలం కొన్ని కీలక సన్నివేశాలను మాత్రమే తెరకెక్కించాలని చెప్పుకొచ్చాడు. ఇకపోతే రెండవ భాగం లో మహాభారతం లోని మరికొన్ని పాత్రలు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ నాగ అశ్విన్. మహాభారతం లో పాండవులకు, శ్రీ కృష్ణుడికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహారథులు , వర్తమానం లో కల్కి భగవానుడిని భూమి మీదకు సురక్షితంగా తీసుకొచ్చే వారీగా కనిపించబోతున్నారు. ఇప్పటికే అశ్వథామ, కర్ణుడు వంటి వారు కల్కి చిత్రం లో కల్కి కోసం పోరాడే వారీగా చూపించారు.

- Advertisement -

Kalki 2898 AD Release Date: Prabhas's Kalki 2898 AD movie release date discussions on | Times Now

ఇక రెండవ భాగం లో భీష్ముడు కూడా కల్కి ని రక్షించే వాడిగా కనిపించబోతున్నాడట. మహాభారతం లో భీష్ముడు కూడా కౌరవుల తరుపున పోరాడిన అందరికీ తెలిసిందే. ఇలా భీష్ముడు, కర్ణుడు, అశ్వర్థాముడు ముగ్గురు కలిసి ప్రిన్స్ యాస్కిన్ ( కమల్ హాసన్) తో పోరాడి, కల్కి ని కాపాడనున్నారు. ఇకపోతే భీష్ముడి పాత్ర కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ని సంప్రదించే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఆయన ఒప్పుకొని ఈ పాత్ర చేస్తే కల్కి 2 రెండు వేల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు. వచ్చే ఏడాది, లేదా ఈ ఏడాది చివర్లోనే కల్కి 2 వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Kalki 2898 AD 'wows' Rajinikanth; Nag Ashwin speechless as actor lauds him for 'taking Indian cinema to different level' - Hindustan Times

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here