Bigg Boss : ఈమధ్య కాలం లో పలు బిగ్ బాస్ సీజన్స్ లోని కంటెస్టెంట్స్ హద్దులు దాటి ప్రవర్తించేస్తున్నారు. కంటెంట్ కోసం ఏది పడితే అది చేస్తూ కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల ముందుకు చులకన అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ 7 లో కంటెస్టెంట్స్ ఏ రేంజ్ లో బూతులు తిట్టుకుంటున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. హోస్ట్ నాగార్జున వీకెండ్స్ లో కంటెస్టెంట్స్ కి ఈ విషయం లో చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.
ఇది కాసేపు పక్కన పెడితే సీజన్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ ఏ రేంజ్ లో హద్దులు దాటారో మనమంతా చూసాము. ముఖ్యంగా సిరి మరియు షణ్ముఖ్ మధ్య జరిగిన రొమాన్స్ పెద్ద చర్చలకు దారి తీసింది. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ అన్నీ సీజన్స్ లోను వేరే లెవెల్ వెర్రి అనిపించింది మాత్రం సీజన్ 5 లోని సిరి – షణ్ముఖ్ మధ్య జరిగిన రొమాన్స్ అని చెప్పొచ్చు.
ఇది ఇలా ఉండగా హిందీ బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ 17 ఇప్పుడు హద్దులన్నీ దాటేసింది. ఈ సీజన్ లో భార్య భర్తలుగా ఎంట్రీ ఇచ్చారు అంకిత లోఖండే మరియు విక్కీ జైన్. ఈ జంట ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో రోజుకి ఒక కాంట్రవర్సీ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది. వీళ్ళ మధ్య జరిగే రొమాన్స్, గొడవలు, కోపాలు మరియు అలకలు బాలీవుడ్ ఆడియన్స్ చూడలేకపోయారు.
రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో అయితే విక్కీ జైన్ ఆట పట్టించినప్పుడు అతనిని కొడుతూ ఉంటుంది అంకిత. ఈ క్రమం లో ఆమె తన చెప్పులను విప్పి భర్త మీదకి విసురుతుంది. ఇది చూసే సమాజానికి ఈమె ఇలా చెప్పులు విసిరి ఏమి చెప్పాలనుకుంటుంది. సెలబ్రిటీస్ అన్నాక కచ్చితంగా వాళ్ళ అభిమానులు ప్రభావితం అవుతారు. ఈమె కూడా ఆమె అభిమానులకు తమ భర్తలను ఇలా చెప్పు తీసుకొని కొట్టమని చెప్తుందా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.
Mujhe yeh vali fight dekhni hain
— Ankitalokhande (fan) (@Ankitafam) November 19, 2023
Serious vali nahi
bolna mat chappal maari 😂
Kyuki yeh bohot Masti vala tha jaise bestfriends ek dooshre ko maarte hain
Ek gala daba raha ek chapal 😂😂🤣
Ankita is in muanku mood#ankitalokhande #vickyjain #biggboss17 #munawarfaruqui pic.twitter.com/zbtRESokWN