Happy Days : ‘హ్యాపీ డేస్’ మూవీ ఆడిషన్స్ కోసం 25 లక్షలు ఖర్చు చేసిన బిగ్ బాస్ సన్నీ..? అసలు ఏమైందంటే!

- Advertisement -

Happy Days : బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ వీజే సన్నీ వరుస పెట్టి హీరో గా సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ, థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు వెళ్తున్నాయో కూడా ఎవరికీ తెలియడం లేదు. ఇప్పుడు ఆయన హీరో గా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ‘సౌండ్ పార్టీ’ అనే చిత్రం ద్వారా మన ముందుకు ఈ నెల 24 వ తేదీన రాబోతున్నాడు.

Happy Days
Happy Days

ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇంటర్వూస్ లో ఈయన ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. మన టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ లో కొత్త వాళ్ళతో సినిమాలు చెయ్యడానికి ఎక్కువగా ఆసక్తి చూపించే దర్శకులలో ఒకడు శేఖర్ కమ్ముల. ఈయన ఆరోజుల్లో తీసిన హ్యాపీ డేస్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో ప్రముఖ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ పోషించిన రాజేష్ పాత్ర కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాత్ర కోసం ఆడిషన్స్ చేస్తున్నప్పుడు సన్నీ కూడా వచ్చాడట. ఆ పాత్ర ని నీకు వచ్చేలా చేస్తాను, పాతిక లక్షలు సిద్ధం చేసుకో అని ఆ సినిమాకి పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ సన్నీ తో అన్నాడట. సన్నీ చేతిలో అంత డబ్బులు లేక ఆ పాత్ర ని మిస్ చేసుకున్నాడట.

- Advertisement -

ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్స్, పాతిక లక్షలు పోతే పోయాయి, అద్భుతమైన పాత్ర, చేసి ఉంటే కెరీర్ వేరే లాగ ఉండేది కదా అని కామెంట్స్ చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఆ క్యారక్టర్ చేసిన నిఖిల్ సిద్దార్థ్ కూడా ఇలా డబ్బులు ఇచ్చి సొంతం చేసుకున్నదే అట. ఈ విషయం ఆయన అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here