హీరోయిన్ ని మార్చమని చెప్పినందుకు హీరోనే సినిమా నుండి తీసేసిన స్టార్ డైరెక్టర్.. ఇదే ఇండస్ట్రీ లో తొలిసారి జరగడం!

- Advertisement -

సినీ రంగం లో ఏ ఇండస్ట్రీ లో అయినా స్టార్ హీరోనే మెయిన్. వాళ్ళ అంగీకారం లేనిదే కనీసం లైట్ బాయ్స్ పని చెయ్యడానికి కూడా వీలు లేదు, ఏదైనా వాళ్ళని అడిగి చెయ్యాల్సిందే. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ తీసుకోవాలని దర్శకుడు కానీ, నిర్మాత కానీ అనుకున్నప్పటికీ హీరో అనుమతి కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ప్రముఖ హీరో రాజశేఖర్ విషయం లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన వింటే నవ్వు ఆపుకోలేరు. జీవిత మరియు రాజశేఖర్ ఇద్దరు కూడా తమిళ సినీ పరిశ్రమకి చెందిన వాళ్ళు.

రాజశేఖర్
రాజశేఖర్

కానీ వీళ్లిద్దరు చివరికీ తెలుగు సినీ పరిశ్రమకి పరిమితమయ్యారు, కలిసి ఎన్నో సినిమాలు చేసారు, ఆ తర్వాత ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు ఆడపిల్లల్ని కన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఇండస్ట్రీ లో హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. అయితే ఇండస్ట్రీ కి వచ్చి రాజశేఖర్ రెండు మూడు హిట్లు కొట్టి ఫామ్ లో ఉన్న సమయం లో ఒక ప్రముఖ నిర్మాత చిత్రం లో నటించాల్సి ఉంది.

ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర చాలా క్యూట్ గా బబ్లీగా ఉంటుంది. అందాల ఆరబోత మోతాదు కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా జీవిత ని తీసుకుందాం అని అనుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ జీవిత అప్పటి వరకు కేవలం సంసార పక్షం గా ఉండే పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చింది. అలాంటి అమ్మాయి ఈ క్యారక్టర్ ఎలా చెయ్యగలుతుంది, వేరే హీరోయిన్ ని తీసుకుందాం అని రాజశేఖర్ అన్నాడట. అప్పటికీ వీళ్లిద్దరికీ పెళ్లి కూడా కాలేదు.

- Advertisement -

అయితే నిర్మాత రాజశేఖర్ చెప్పింది మొత్తం విని , సరే అని చెప్పి ఇంటికి పంపాడట. నాలుగు రోజుల్లో షూటింగ్ ఉంటుందని చెప్పారట. కానీ నాలుగు రోజులు దాటి పది రోజులైనా షూటింగ్ కి పిలుపు రాకపోవడం తో రాజశేఖర్ కి అనుమానం వచ్చి ఫోన్ చెయ్యగా, ఆయనని సినిమా నుండి తేసేసినట్టు చెప్పుకొచ్చారు. దెబ్బకి రాజశేఖర్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించినంత పని అయ్యింది. ఇది జీవితం లో తనకి జరిగిన అతి పెద్ద అవమానం అని రాజశేఖర్ గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here