ఇటీవల ఎన్నో అంచనాల నడుమ రిలీజైన మెగాస్టార్ భోళా శంకర్ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడుదలైన మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుని మెగా ఫ్యాన్స్ ను సైతం మెప్పించలేకపోయింది. కనీసం ఏ ఒక్కరి నోట కూడా ఏవరేజ్ అన్న టాక్ వినిపించలేదు. అంత దరిద్రంగా మెహర్ రమేష్ సినిమాను డైరెక్ట్ చేశారన్న కామెంట్లు వస్తున్నాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సరే ఈ సినిమా గురించే చర్చ. మెగాస్టార్ అయింది..

ఎన్నో వందల చిత్రాల్లో నటించిన చిరంజీవి ఈ సినిమా ఎంపికలో ఎందుకిలా చేశారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు వరుస ప్లాపుల్లో ఉన్న మెహర్ రమేష్ కు ఎలా డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారంటూ ఒకటే చర్చ. ఇకపోతే సినిమాలో నటించినందుకు చిరంజీవికి పారితోషకం ఇంకా సదరు నిర్మాత పూర్తిగా చెల్లించలేదని టాక్. ఆ విషయంలో చిరంజీవికి భోళా శంకర్ నిర్మాతకు మధ్య విబేధాలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు. ఈ చిత్రంలో నటించినందుకు చిరంజీవికి రూ .65 కోట్ల పారితోషకంతో పాటు రూ.5 కోట్లు అదనంగా ఖర్చులకని ఒప్పుకున్నారట. అయితే అందులో అడ్వాన్స్ గా రూ.50 కోట్లు ఇచ్చేసారని, ఇక సినిమా విడుదల అయ్యి డిజాస్టర్ అయినా కూడా ఇంకా రూ.20 కోట్లు ఇవ్వాలని మెగాస్టార్ డిమాండ్ చేశారట. చిరంజీవి గట్టిగా తన రెమ్యునరేషన్ అడిగే సరికి వరుసగా రెండు సినిమాలతో దాదాపు రూ.200కోట్లు నష్టపోయిన అనిల్ సుంకర ఇక చేసేదేం లేక కొన్ని ఆస్తులు అమ్ముకున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయినా డబ్బులు సరిపోక పోవడంతో మరొకవైపు కొన్ని ఆస్తులను తాకట్టు కూడా పెడుతున్నారంటూ కథనాలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఇదంతే ఫేక్ అంటూ మెగా అభిమానులు ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక మెగా అభిమాని అనిల్ సుంకర కు డైరెక్ట్ గా మెసేజ్ చేశారట. అందులో సార్ ఇది నిజమేనా అని అడిగారట. తాను అమెరికా వెళ్తున్నానని నిర్మాత రిప్లై ఇచ్చినట్లు అందులో ఉంది. అయితే దీనికి సంబంధించిన వార్త వైరల్ అవుతుండగా.. నేను మళ్ళీ చిరంజీవి గారితో మరో సినిమా చేస్తున్నాను.. ఆయన చాలా మంచివారు.. ఆ సినిమాతోనే సమాధానం చెబుదామంటూ అనిల్ అన్నట్లు సమాచారం.
