పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బ్రో’ కి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ మొన్ననే విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మోషన్ పోస్టర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ ఎంతో స్టైలిష్ గా ఉంది. ఫ్యాన్స్ ఆయనని చూసి పంజా రోజుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ని గుర్తు చేసుకున్నారు.
ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా చిత్తం’ చిత్రానికి ఇది రీమేక్.కేవలం ఆ సినిమాలోని స్టోరీ లైన్ ని తీసుకొని పవన్ కళ్యాణ్ ఇమేజి కి తగ్గట్టుగా కమర్షియల్ మార్పులు చేర్పులు చేసి ఈ చిత్రానికి కథ , స్క్రీన్ ప్లే మరియు మాటలు రాసాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సముద్ర ఖని దర్శకత్వం వహించాడు.
అయితే ఈ మోషన్ పోస్టర్ పవన్ కళ్యాణ్ ధరించిన బూట్లు మరియు టీ షర్ట్ చాలా కొత్తగా అనిపించింది. పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏ వస్తువుని అయిన కొనడానికి ముందు ఉండే ఆయన ఫ్యాన్స్ ని బూట్లు ఎంతగానో ఆకర్షించాయి. ఆన్లైన్ లో వెతికి కొనుక్కుందాం అని చూసిన తర్వాత ఆ బూటు రేట్ చూసి ఫ్యాన్స్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఈ బూట్ల ధర అక్షరాలా 1200 అమెరికన్ డాలర్లు.
దీనిని ఇండియన్ కరెన్సీ లోకి మారిస్తే దాదాపుగా లక్ష రూపాయిలు అవుతుంది. లక్ష రూపాయిలు అనేది ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఐటీ ఉద్యోగి నెల జీతం. ఆ లక్ష రూపాయలతో నెల మొత్తం కుటుంబం సంతోషంగా బ్రతికేయొచ్చు. కానీ అమెరికా లో ఉద్యోగాలు చేస్తున్న కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత డబ్బులు అయిన పెట్టి కొనడానికి సిద్ధం గా ఉన్నారు.